New Gen Maruti Dzire Full Review కొత్త మారుతి డిజైర్‌ మురిపించిందా? ఈ 5 స్టార్ కారు ఎలా ఉందంటే?

భారతీయ కార్ల మార్కెట్‌లో సబ్-4-మీటర్ సెడాన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి స్విఫ్ట్‌ డిజైర్‌ని ఆ సంస్థ 2008లో తీసుకువచ్చింది. దీనిని విడుదల చేసిన 16 సంవత్సరాలలో భారతీయ కార్ మార్కెట్‌లో ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా అవతరించి తిరుగులేని శక్తిగా ఎదిగింది. సంవత్సరాలు మారుతున్న కొద్ది మారుతి సుజుకి డిజైర్ అనేక మార్పులతో మార్కెట్‌లో అప్‌గ్రేడ్‌ అవుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో SUVలకు క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ సెడాన్‌ సేల్స్‌లో అదరగొడుతోంది.

మార్కెట్‌లో మంచి హిట్‌ టాక్‌ కలిగిన ఈ న్యూ జనరేషన్‌ మారుతి డిజైర్‌ని కేవలం రూ. 6.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ 2024 మారుతి సుజుకి డిజైర్‌ అనేక మార్పులు, చేర్పులతో అడుగుపెట్టింది. తాజాగా విడుదలైన 4th జనరేషన్‌ మారుతి డిజైర్‌ని మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్‌ రివ్యూ మీకోసం..

New Gen Maruti Dzire Review

డిజైన్: మారుతి సుజుకి డిజైర్ మనుపటి వలె స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌తో వస్తుంది. అయితే కొన్ని స్విఫ్ట్‌ పోలీకలను మార్పు చేసి చతురస్రాకారపు రూపంతో తీసుకువచ్చారు. ఓ విధంగా చూడటానికి ఇది అచ్చం హోండా అమేజ్‌లా కనిపిస్తుంది. ముందు భాగంలో గ్రిల్‌తో LED హెడ్‌లైట్స్‌, గ్రిల్ పైభాగంలో పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్ కలదు. దాని కింద క్రోమ్ స్ట్రిప్‌తో పాటు సుజుకి బ్యాడ్జ్‌ను హెడ్‌లైట్స్‌ని లింక్‌ చేస్తుంది.

ఇంటిగ్రేటెడ్ LED DRLs, దాని కింద హాలోజన్ టర్న్ సిగ్నల్‌లను కలిగి ఉంటుంది. హెడ్‌లైట్స్‌లో క్రిస్టల్ యూనిట్స్‌ కలవు. డిజైర్ ఫ్రంట్‌లో సరికొత్త బంపర్‌ని కలిగి ఉంది. ఇది ఫాగ్‌లైట్‌ల కోసం హౌసింగ్‌లను కలిగి ఉంటుంది. కొత్త బానెట్‌ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. సైడ్‌ ఫ్రొఫైల్‌లో 2024 మారుతి డిజైర్‌ డ్యూయల్-టోన్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, కాంటౌర్డ్ డోర్ ప్యానెల్స్‌, ఫెండర్స్‌ ఆకట్టుకుంటాయి. దీనిపై రూఫ్‌లైన్ కూడా ఉంది.

New Gen Maruti Dzire

ఫీచర్లు: కారులో అడుగుపెట్టగానే కొత్త స్విఫ్ట్‌కి డ్యూయల్-టోన్ (లేత గోధుమరంగు- టాప్ సెక్షన్, డాష్, సీట్లు), బ్లాక్ (డాష్, డోర్ కార్డ్స్‌ దిగువ విభాగాలు) ఆకర్షణీయంగా కనిస్తాయి. ఫాక్స్ వుడ్, బ్రష్ చేసిన అల్యూమినియం ఎలిమెంట్స్‌తో కూడిన మల్టీ-లేయర్డ్ సర్‌ఫేస్‌ డ్యాష్‌బోర్డ్ ముందు భాగంలో దృష్టిని ఆకర్షిస్తుంది. డ్యాష్‌బోర్డ్ పైన వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay కనెక్టివిటీతో కూడిన పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది.

ఇందులో మంచి మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేసేందకు Arkayms-ఆధారిత సౌండ్ సిస్టమ్‌ని అందించారు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 360-డిగ్రీ కెమెరాకు డిస్‌ప్లేగా కూడా పనిచేస్తుంది. సుజుకి కనెక్ట్ యాప్స్‌ని యాక్సెస్‌ను అనుమతిస్తుంది. దీని ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని యాక్సెస్‌ చేసుకోవచ్చు. కొత్త డిజైర్ క్యాబిన్ వెనుక AC వెంట్స్‌తో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ USB పోర్ట్స్‌, వైర్‌లెస్ ఛార్జర్, ఇందులో తొలిసారి ఎలక్ట్రిక్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ని అందించారు.

New Gen Maruti Dzire Review

డిజైర్‌లోని సీట్లు క్లాత్ అప్హోల్స్టరీని కలిగి ఉంటాయి. రోజువారీ ప్రయాణానికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. డిజైర్‌లోని వెనుక సీట్లు ముగ్గురు పెద్దలకు సరిపోయేంత వెడల్పుగా ఉంటాయి. అలాగే మంచి లెగ్‌రూమ్‌ స్పేస్‌ కూడా లభిస్తుంది. పొడవుగా ఉన్నవారికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మంచి హెడ్‌రూమ్‌ స్పేస్‌ని అందిచారు. లగేజీ క్యారీ చేయడం కోసం 382-లీటర్ బూట్ స్పేస్‌ కలిగి ఉంది.

సేఫ్టీ ఫీచర్లు: మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఇటీవలె గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. ఇందులోని ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ప్రతి సీటుకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్‌, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్ల ద్వారా తొలిసారి 5 స్టార్‌ సాధించిన మారుతి సుజుకి కారుగా నిలిచింది.

New Gen Maruti Dzire Interior

డైమెన్షన్స్‌: కొత్త 2024 మారుతి సుజుకి డిజైర్ 3,995mm పొడవు, 1,735mm వెడల్పు, 1,525mm పొడవుని కలిగి ఉంది. కొత్త డిజైర్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న దాని కంటే 10 మిమీ మాత్రమే పొడవు, 2,450 మిమీ పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. బ్రాండ్-న్యూ 4th జనరేషన్‌ మారుతి డిజైర్ 163mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. 185-సెక్షన్ టైర్స్‌ 15-ఇంచెస్‌ వీల్స్‌పై ప్రయాణిస్తుంది.

ఇంజిన్‌: డిజైర్ కొత్త స్విఫ్ట్‌లోని Z12E ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది పెట్రోల్ మోడ్‌లో 80.46bhp, 111.7Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే CNGలో 68.8bhp, 101.8Nm టార్క్‌ని అందిస్తుంది. పెట్రోల్ డిజైర్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది. అయితే CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

New Gen Maruti Dzire Rear View

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: డిజైర్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటర్‌కి 24.79 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్‌ వెర్షన్‌లో 25.71 మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్ 33.73 km/kg మైలేజీని అందిస్తుంది. సుజుకి డిజైర్ మునుపటి K సిరీస్ నుంచి కొత్త Z12E ఇంజిన్‌కి మారడం వల్ల పవర్, టార్క్ తగ్గింది. ఇంజిన్ ప్రతిస్పందన ఇప్పటికీ లీనియర్‌గా అనిపిస్తుంది.

మేము టెస్ట్ చేసిన AMT గేర్‌బాక్స్ కొంచెం లేజీగా అనిపించింది. మ్యానువల్‌ వేరియంట్‌ మంచి ఫర్ఫామెన్స్‌ని అందించే అవకాశం ఉంది. స్టీరింగ్ తేలికగా ఉంటుంది. ఇది మూలమలుపుల వద్ద సలభంగా మార్చడానికి అనుమతిస్తుంది. డిజైర్ సస్పెన్షన్ సెటప్ చాలా బ్యాలెన్స్‌గా అనిపిస్తుంది. కార్నర్స్‌లో బాడీ రోల్‌ను అదుపులో ఉంచుతుంది.

New Gen Maruti Launch

చివరకు: కొత్త 2024 మారుతి సుజుకి డిజైర్ ఫర్‌ఫెక్ట్‌ ఆప్షన్ అని తెలిసింది. ఇందులో సరికొత్త ఫీచర్లను జోడించింది. కొత్త డిజైన్‌, హై ఫర్ఫామెన్స్ ఇంజిన్‌, 5 స్టార్ రేటింగ్‌, భారీ మైలేజీతో అన్ని విభాగాల్లో ఆల్‌రౌండర్‌గా ఉంది. ముఖ్యంగా ఇది టాక్సీ ప్లేయర్స్‌కి అలాగే మంచి ఫ్యామిలీ కారుని కోరుకునే వారికి సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 12, 2024, 10:32 [IST]
English summary
New gen maruti dzire review driving impressions and specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+