Hyundai Venue Review : కొత్తగా ముస్తాబై వచ్చిన వెన్యూ.. బడ్జెట్ ధరలో బెస్ట్ కారు కావాలా ? అయితే ఓ లుక్కేయండి
Hyundai Venue Review : భారత కాంపాక్ట్ ఎస్యూవీ(Compact SUV) సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు రెండవ తరం హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue) దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 7.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త వెన్యూ లోపల, బయట భారీ మార్పులతో మునుపటి మోడల్‌తో పోలిస్తే ఏకంగా 60కి పైగా అప్డేట్లతో వచ్చింది.
తాజా స్టైలింగ్, సెగ్మెంట్‌లోనే లభించని అడ్వాన్సుడ్ ఫీచర్లు (Advanced Features), మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లు దీనికి ప్రధాన ఆకర్షణలు. హ్యుందాయ్ వెన్యూ ధరలు రూ. 7.90 లక్షల నుంచి రూ. 15.50 లక్షల వరకు ఉండగా మరింత స్పోర్టీగా ఉండే N లైన్ వెర్షన్ కూడా త్వరలోనే రాబోతుంది.

ADAS, లగ్జరీ ఇంటీరియర్!
కొత్త హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు లెవెల్ 2 అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) తో రెడీ అయింది. ఇది సేఫ్టీలో పెద్ద ముందడుగు. అలాగే, ఇందులోని కొత్త 12.3-అంగుళాల కర్వ్డ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే (Curved Touchscreen Display) క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చింది. ఈ SUV మునుపటి కంటే వెడల్పుగా, పొడవుగా, లాంగ్ వీల్ బేస్ కలిగి ఉంది(20 మి.మీ. ఎక్కువ), ఇది లోపల మరింత ఎక్కువ స్పేస్(Cabin Space) అందిస్తుంది.

ఎక్స్‌టీరియర్ హైలైట్స్
కొత్త వెన్యూ డిజైన్‌లో పెద్ద మార్పులు చేశారు, ఇది ఎస్‌యూవీకి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఇది డార్క్ క్రోమ్ గ్రిల్, పెద్ద సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ముందు భాగంలో కనెక్ట్ అయ్యి మోడ్రన్ లుక్ ఇస్తాయి. మెరుగైన ఆడియో అనుభవం కోసం బూట్‌లో సబ్‌వూఫర్ కూడా ఉంది.

వెన్యూ స్టాండర్డ్‌గా 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది (N లైన్ 17-అంగుళాల వీల్స్‌తో వస్తుంది). వెనుక భాగంలో కనెక్టింగ్ లైట్ బార్‌తో కూడిన కొత్త ఫుల్ LED టెయిల్-ల్యాంప్‌లు, వెన్యూ బ్యాడ్జింగ్ ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 195 ఎంఎం వద్ద ఉంది. బూట్ స్పేస్ 375 లీటర్లు ఉంది. వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో మడవవచ్చు. కొత్త వెన్యూ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా, మోడ్రన్‌గా ఉంది.

ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లోపల అత్యంత ముఖ్యమైన మార్పులలో వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇంటీరియర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ అప్‌హోల్స్టరీతో (నలుపు, లేత గోధుమరంగు) వస్తుంది. ముందు సీట్లు ఇప్పుడు వెంటిలేట్ (Ventilated) చేయబడతాయి. వెనుక వైపు కప్ హోల్డర్‌లతో కూడిన ఆర్మ్‌రెస్ట్, సన్‌షేడ్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో కప్ హోల్డర్‌లు, స్పెషల్ AC వెంట్స్, రెండు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.

డాష్‌బోర్డ్‌లో 12.3-అంగుళాల కర్వ్డ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ హబ్‌గా పనిచేస్తుంది. వెదర్ కంట్రోల్ సెట్టింగ్స్ కోసం ఒక చిన్న స్క్రీన్ కూడా ఉంది. క్యాబిన్లో బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్లు), వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ IRVM (SOS బటన్లతో), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌పై హ్యుందాయ్ 'H' లోగోకు బదులుగా మోర్స్ కోడ్‌ను సూచించే నాలుగు చుక్కలు ఉన్నాయి.

కొత్త వెన్యూ పవర్, మైలేజ్ పరంగా మూడు ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 1.5-లీటర్ టర్బో డీజిల్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది.

1.0-లీటర్ టర్బో పెట్రోల్ అత్యంత పవర్ఫుల్ ఆప్షన్. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్, 173 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్
7-స్పీడ్ DCT తో కూడిన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఫాస్ట్, స్మూత్ గేర్ మార్పులను అందిస్తుంది. సస్పెన్షన్ కాస్త గట్టిగా ఉన్నప్పటికీ, ఇది రోడ్ హ్యాండ్లింగ్‌కు బాగా సహాయపడుతుంది. హై-స్పీడ్‌లో కూడా కారు స్థిరంగా ఉంటుంది. బాడీ రోల్ తక్కువగా ఉంటుంది. స్టీరింగ్ తేలికగా ఉండి, సిటీలో డ్రైవింగ్‌కు సౌకర్యంగా ఉంటుంది.

ఫైనల్‌గా
కొత్త హ్యుందాయ్ వెన్యూ దాని లేటెస్ట్ డిజైన్, విస్తృత ఫీచర్ల జాబితా, స్ట్రాంగ్ ఇంజిన్ ఆప్షన్లతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. సేఫ్టీ పరికరాలు, మెరుగైన స్పేస్, వెంటిలేటెడ్ సీట్ల వంటి ఫీచర్లు దీని వ్యాల్యూను మరింత పెంచాయి. స్ట్రాంగ్ ఫీచర్లు, విలువ కలిగిన కాంపాక్ట్ SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులకు, కొత్త వెన్యూ నిస్సందేహంగా బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications








