Switch IeV3 and IeV4 Full Review ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ ఎలా ఉన్నాయంటే?

2024 మోడల్‌ స్విఛ్‌ ఐఈవీ4 (Switch IeV4) మరియు స్విఛ్‌ ఐఈవీ4 (Switch IeV3) ఎలక్ట్రిక్ కమర్షియల్‌ వెహికిల్స్‌ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్ చేసింది. చెన్నైలోని అశోక్ లేలాండ్ టెక్నికల్ సెంటర్‌లో దీనిని పూర్తి స్థాయిలో రివ్యూ చేశాము. ఈ వెహికిల్స్‌ని హై-స్పీడ్ ట్రాక్‌ ఫర్ఫామెన్స్‌, గ్రేడియంట్ హ్యాండ్లింగ్, ఓపెన్ గ్రౌండ్‌లో టెస్టింగ్‌ చేశాము. వీటి ఫర్ఫామెన్స్‌, డ్రైవింగ్‌ ఇంప్రెషన్స్‌, ఈ వెహికిల్స్‌ సామర్థ్యాలకు సంబంధించి ఎలా ఉందో పూర్తి స్థాయిలో రివ్యూ చేశాము. ఆ వివరాలు మీకోసం..

డిజైన్ & లుక్‌: స్విచ్ IeV3 మరియు IeV4 ఎలక్ట్రిక్ కమర్షియల్‌ వెహికిల్స్‌ పూర్తి స్థాయిలో ICE వెర్షన్‌ల మాదిరిగా ఉంటాయి. హెడ్‌ల్యాంప్స్‌, ఇంటిగ్రేటెడ్ క్లోజ్డ్ గ్రిల్, ఛార్జింగ్ పోర్ట్, ఢిఫరెంట్‌ లుక్‌లో EV- గ్రాఫిక్స్‌తో ఈ హెహికిల్స్‌ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Switch IeV3 and IeV4 Full Review in Telugu 2024

ఇక వీటి ఇంటీరియర్‌ సౌకర్యవంతంగా రూపొందించారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ముఖ్యంగా IeV4లో అధునాతన డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, USB ఛార్జింగ్ పోర్ట్స్‌, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. డ్రైవర్‌కి అలాగే తోటి ప్రయాణీకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

స్పెసిఫికేషన్స్‌: స్విచ్ IeV3 40 kW మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 190 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక Switch IeV4 మరింత శక్తివంతమైన 60 kW మోటార్‌తో 230 Nm టార్క్‌ను అందజేస్తుంది. IeV3, IeV4 కోసం పేలోడ్ సామర్థ్యం వరుసగా 1200 కిలోలు, 1700 కిలోలుగా ఉన్నాయి. IeV4 భారీ కార్గో సర్వీస్‌ల కోసం భారీ స్థలాన్ని అందించారు.

Switch IeV3 and IeV4 Range

ఇక IeV3 మరియు IeV4 స్టోరేజ్‌లు వరుసగా 8ft x 5ft x 1.6ft మరియు 9ft x 5ft x 1.7ft వద్ద ఉన్నాయి. దీంతో ఇవి పూర్తి స్థాయిలో కమర్షియల్‌ అవసరాలకు సరిపోతాయి. వీటి పవర్‌ మరియు సామర్థ్యంలో తేడాలు ఉన్నప్పటికీ రెండు వాహనాలు వాటి సామర్థ్యానికి తగినట్లుగా రూపొందించబడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ రేంజ్‌ని అందిచేలా వీటి ఛార్జింగ్‌ అవుట్‌పుట్‌ ఉన్నాయి.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్:హై-స్పీడ్ ట్రాక్: రెండు వాహనాలు హై-స్పీడ్ ట్రాక్‌లో అద్భుతంగా పనిచేశాయి. IeV4, ప్రత్యేకించి, 60km/h వేగంతో కూడా అసాధారణమైన స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అయితే IeV3లో బాడీ రోల్ మరియు స్టీరింగ్ సిస్టమ్‌తో కొంచెం స్లోగా కంపోజ్ అయినట్లు అనిపించింది. ఈ విషయంలో leV4 బాగా రాణించిందనే చెప్పాలి.

Switch IeV3 and IeV4 Full Review in Telugu 2024

ఖాళీ గ్రౌండ్‌లో హ్యాండ్లింగ్: ఖాళీ మైదానంలో, రెండు వాహనాలు ఆకట్టుకునే విధంగా ప్రదర్శించాయి. IeV4 యొక్క టైట్ టర్నింగ్ రేడియస్ మరియు రెస్పాన్సివ్ స్టీరింగ్ డ్రైవ్ చక్కగా అనిపించింది. అయితే అయితే IeV3 కూడా కొంచెం తక్కువ చురుకుదనంతో పనిచేసిందని చెప్పాలి.

గ్రేడియంట్ టెస్ట్: గ్రేడియంట్ టెస్ట్ రెండు మోడళ్ల మధ్య కొన్ని తేడాలను వెల్లడించింది. IeV3 డ్రైవ్ మోడ్‌లో ఏటవాలుగా ఉన్న 10.6° గ్రేడియంట్‌ను అధిరోహించడానికి చాలా కష్టపడింది. కొండలపై వెళ్లేటప్పుడు దీనిని నియంత్రించడం అవసరం. స్పోర్ట్ మోడ్‌లో పైకి ఎక్కడానికి దీనికి అదనపు బ్యాటరీ శక్తి అవసరం పడుతుంది. ఇక IeV4, మరోవైపు, 10.6° గ్రేడియంట్‌ను సులభంగా అధిరోహించింది.

Switch IeV3 and IeV4 Full Review in Telugu 2024

చివరగా: స్విచ్ IeV4ని స్విచ్ IeV3తో పోల్చి చూస్తే, ఎలక్ట్రిక్ కమర్షియల్‌ హెవికిల్స్‌లో అత్యుత్తమ స్థిరత్వం, సౌలభ్యం, మెరుగైన పనితీరును కోరుకునే డ్రైవర్ల కోసం IeV4 ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ. రూ. 15.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇక IeV3 సమర్థవంతమైన మరింత సరసమైన ఎలక్ట్రిక్ హెహికిల్‌ కోసం వెతుకుతున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. దీని ధర రూ. 12.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని పనితీరు, IeV4 కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, పలు రకాల కమర్షియల్‌ అవసరాలకు ఇది సరిపోతుంది.

Switch IeV3 and IeV4 Full Review in Telugu 2024

స్విచ్ IeV3 మరియు IeV4 ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ రెండూ వెహికిల్స్‌ ఎలక్ట్రిక్ మార్కెట్‌లో కొనుగోలుదారుల కోసం బెస్ట్‌ ఆప్షన్‌గా ఉన్నాయి. దీని ఢిఫరెంట్‌ డిజైన్, భారీ స్పెసిఫికేషన్‌లు మరియు ఆకట్టుకునే పనితీరు సామర్థ్యాలతో, ఈ వాహనాలు కమర్షియల్‌ రవాణా అవసరాల కోసం పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను అందించడానికి బెస్ట్‌ వెహికిల్స్‌గా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 22, 2024, 14:00 [IST]
English summary
Switch iev3 and iev4 review driving impressions specs features and range details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+