Tata Altroz iCNG Full Review టాటా ఆల్ట్రోజ్ iCNG ఇంజిన్ ఫర్మామెన్స్, డిజైన్, ఫీచర్లు పుల్ రివ్యూ..
Tata మోటార్స్ తన సీఎన్‌జీ మోడల్ Altroz iCNGని విడుదల చేసింది. 2023 సంవత్సరం ప్రారంభంలో నిర్వహించిన ఆటో షోలో ఈ కారును టాటా మోటార్స్ తొలిసారిగా ప్రదర్శించింది. అయితే టాటా మోటార్స్ సంస్థ తీసుకొచ్చిన ఆల్ట్రోజ్ iCNG భారత్‌లో సీఎన్‌జీ కొత్త శకానికి ఏం సంకేతాలు ఇవ్వనుంది. ఈ కారు పనితీరు ఎలా ఉండబోతోంది. ఒకసారి చూద్దాం.
Tata ఆల్ట్రోజ్ iCNG.. : ప్రస్తుతం మార్కెట్ అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఆల్ట్రోజ్ iCNG మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుంటే అనేక ప్రత్యేకతలతో ఈ కారును తీసుకొచ్చారు. కారులోపల సీఎన్‌జీ బటన్ మినహాయిస్తే.. ఈ కారు సీఎన్‌జీ మోడల్ అని గుర్తించేలా ఎటువంటి గుర్తులు లేవు. అయితే భారత్‌లో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్ పేన్ రూఫ్‌గా వచ్చిన తొలి సీఎన్‌జీ వాహనంగా ఆల్ట్రోజ్ నిలవనుంది.

పెట్రోల్ వెర్షన్‌లో ఏ విధమైన ఫీచర్లు ఉన్నాయో సుమారుగా iCNGలోనూ అదే తరహా ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఆల్ట్రోజ్ iCNG సొంతం. ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. వీటితోపాటు టాటా iRA స్మార్ట్‌కార్ సెటప్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌పేను ఆల్ట్రోజ్ iCNG సపోర్టు చేయనుంది.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ కారు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ఫ్యూరిఫైయర్, లెథరెట్ సీట్ మరియు డ్యూయర్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ కలిగి ఉంది. ఈ కారులో బూట్‌స్పేస్ విషయంలో చేసిన కీలక మార్పులు మీరు గమనించవచ్చు. కారు వెనుక భాగంలో రెండు 30kg సీఎన్‌జీ సిలిండర్లను బూట్ ప్లోర్ కింద అమర్చారు. దీంతో ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన సీఎన్‌జీ కారుగా ఇది నిలవనుంది.

ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ 345 లీటర్ల బూట్‌స్పేస్ కలిగి ఉంటుంది. అదే సీఎన్‌జీ 210 లీటర్ల బూట్‌స్పేస్‌తో వస్తుంది. అయితే ఈ రెండింటిని పోల్చి చూస్తే సీఎన్‌జీ వేరియంట్ బూట్‌స్పేస్ మీకు తక్కువగా అనిపించవచ్చు. సాధారణంగా సీఎన్‌జీ వాహనాల్లో బూట్‌స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో 6okg కంప్రెస్డ్ సిలెండర్లు ఉన్న ఆల్ట్రోజ్ iసీఎన్‌జీ ఏకంగా 210 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ ఎంత సురక్షితం అంటే.. : టాటా ఆల్ట్రోజ్ iCNG 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ రెవోట్రాన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 87bhp వద్ద 115Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంప్రెస్డ్ మీథేన్ గ్యాస్ ఇన్‌హేలింగ్ జరిగినప్పుడు ఇంజిన్ అవుట్‌పుట్ 87bhp నుంచి 72.4 bhpకు తగ్గుతుంది. అదే సమయంలో టార్క్ కూడా 103Nm నుంచి 12Nmకు తగ్గుతుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కారు డ్రైవింగ్‌లో ఉండగా పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయితే... ఆల్ట్రోజ్ iCNG కారులో ఉన్న స్మార్ట్ ECU టెక్నాలజీ.. ఆటోమేటిక్‌గా పెట్రోల్ నుంచి సీఎన్‌జీలోకి మారుతుంది. టాటా ఆల్ట్రోజ్ iCNG కారును రోజు కూడా సీఎన్‌జీ మోడ్‌లోనే స్టార్ట్ చేసేందుకు ఈ ECU టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఈ కారులో మరో ప్రత్యేకత ఉంది. గ్యాస్ ట్యాంకర్‌ను నింపడం కూడా చాలా సులభం మరియు చాలా వేగంగా పూర్తిచేయవచ్చు. ఈ ట్యాంక్‌కు అమర్చిన ప్రత్యేక నాజిల్‌తో వేగంగా ఫిల్లింగ్ చేయవచ్చు. ఎప్పుడైనా ఫ్యూయర్ ఫిల్టర్ క్యాప్ ఓపెన్ అయినట్లు గుర్తిస్తే.. మైక్రో స్విచ్ దానిని వెంటనే మూసివేస్తుంది. కారులో ఏదైనా థర్మల్ సమస్యను గుర్తిస్తే గ్యాస్‌ను వెంటనే వాతావరణంలోకి పంపుతుంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో ఎయిర్‌బ్యాగ్స్, EDBతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్), బ్రేక్ స్వే కంట్రోల్, సోర్నర్ స్టెబిలిటీ కంట్రోల్ సహా అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ మోడ్‌లో కొన్ని వ్యత్యాసాలను పక్కపెడితే.. నగరాలు, పట్టణాల్లో డ్రైవింగ్ చేసినప్పుడు సీఎన్‌జీ మోడ్ మంచి పనితీరును కనబరుస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ కారులో ఉన్న మరో ప్రత్యేక ఫీచర్ ఎంటంటే.. కారు ఇంధన ట్యాంక్ ఖాళీ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పెట్రోల్ నుంచి సీఎన్‌జీ మోడ్‌లోకి మారుతుంది. కారులో ఉన్న CNG బటన్ ద్వారా డ్రైవర్ కూడా తనకు నచ్చిన సమయాల్లో పెట్రోల్ నుంచి సీఎన్‌జీ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. కారును సీఎన్‌జీ మోడ్‌లోనే స్టార్ట్ చేసే సౌకర్యం టాటా ఆల్ట్రోజ్ iCNG సొంతం. ఇతర సంస్థల కార్లతో పోల్చితే ఆల్ట్రోజ్ iCNGలో ఇదే పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.

ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ కంటే సీఎన్‌జీలో సస్పెస్షన్ బలంగా ఉంటున్నట్లు అనిపిస్తుంది. వెనుక వైపు రెండు సిలిండర్ల బరువు కారణంగా కారు పడిపోకుండా సాయపడుతుంది. అయితే ఈ బరువు కారణంగా రోడ్ల బంప్ వచ్చిన సమయంలో కొంచెం సమస్యగా మారవచ్చు.

ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ కారులో స్టీరింగ్ ఉన్నట్లుగానే సీఎన్‌జీలోను పనితీరు కనబరుస్తుంది. అధిక వేగంగా కారు ప్రయాణిస్తున్న సమయంలో టైర్ల బరువు కాస్త భరోసానిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ iCNG కారులో ఫ్రంట్ టైర్లు డిస్క్ బ్రేకులను.. వెనుక టైర్లు డ్రమ్ బ్రేకులను కలిగి ఉంటాయి. మరియు మంచి పనితీరును కనబరుస్తుంది. NVH లెవల్ (Noise, vibration, harshness) కూడా మెరుగ్గానే ఉంటుంది. అయితే rpm పెరుగుతున్న కొద్దీ NVH లెవల్ కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు.

సాధారణ సీఎన్‌జీ నుంచి టాటా ఆల్ట్రోజ్ iCNGకు మారడం వల్ల ఆదా అవుతుంది. మరియు అధిక బూట్‌స్పేస్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఎటువంటి భద్రతా సందేహాలు లేకుండా సాఫీగా ప్రయాణం కొనసాగించవచ్చు. పట్టణాల్లో టాటా ఆల్ట్రోజ్ iCNG కారు పనితీరు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. హైవేలపై అధిక వేగంతో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు పెట్రోల్‌పై డ్రైవింగ్ చేయాలని అభిప్రాయం కలగవచ్చు. ఈ కారు రూ.7.55 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు టాటా ఆల్ట్రోజ్ కారు సొంతం.


Click it and Unblock the Notifications








