Tata Curvv EV Full Review టాటా కర్వ్‌ ఈవీ ఇరగదీసింది.. ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ లోనే తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టాటా కర్వ్‌ ఈవీని ఆ సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ఈ మోడల్ 45kWh మరియు 55kWh బ్యాటరీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇందులోని బ్యాటరీలు మీకు భారీ రేంజ్‌ని అందిస్తాయి. Curvv EV అధునాతన సాంకేతికతతో పాటు సరికొత్త డిజైన్ రూపకల్పనతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కస్టమర్లకు ఎప్పుడు సరికొత్తగా కార్లను అందించే టాటా నిబద్ధతకు ఇది అద్దం పడుతుంది. ఈ కర్వ్‌ ఈవీని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. దీని డిజైన్, స్పెసిఫికేషన్స్‌, డ్రైవింగ్ ఇంప్రెషన్స్‌తో సహా వివిధ అంశాలకు సంబంధించిన ఫుల్‌ రివ్యూ మీ కోసం అందిస్తున్నాం.

డిజైన్: టాటా Curvv EV SUV కూపే డిజైన్‌ స్టైలింగ్‌తో వస్తుంది. ఇది అధునాతనతతో హంగులతో చూడటానికి సరికొత్తగా కనిపిస్తుంది. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే గా కర్వ్‌ ఈవీ అడుగుపెట్టింది. ఈ కర్వ్‌ బాడీ క్లాడింగ్‌పై పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ఇది సాఫ్ట్‌ టచ్‌ అనుభూతిని కలిగిస్తుంది. స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, శాటిన్ సిల్వర్ బంపర్ స్కిడ్ ప్లేట్లు దీనికి అదనపు ఆకర్షణగా ఉన్నాయి.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

ఇది ఫ్రంట్‌లో 11.6 లీటర్ ట్రంక్ (ఫ్రాంక్) మరియు 500L బూట్ స్పేస్‌తో భారీ స్టోరేజీని కలిగి ఉంది. దీంతో మీ లగేజీ తీసుకెళ్లేందుకు, రోజువారీ అవసరాలను తీర్చేలా లాంగ్‌ డ్రైవ్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. డ్రైవర్ మరియు ప్రయాణీకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా మల్టీ-మూడ్ యాంబియంట్ లైటింగ్‌ ప్రీమియం అనుభూతిని అందింస్తుంది. వాయిస్-అసిస్టన్స్‌ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ పైనున్న ఆకాశాన్ని ఇష్టం వచ్చినప్పుడు ఆస్వాదించచవచ్చు.

ఇంటీరియర్‌లో Curvv EV ఒక ఫైజిటల్ (ఫిజికల్‌-డిజిటల్) కంట్రోల్‌ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది అవసరమైన ఫంక్షన్లను ఇతర ఆపరేటింగ్‌లను సులభతరం చేస్తుంది. స్మార్ట్ డిజిటల్ షిఫ్టర్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ ఛార్జింగ్ క్యాప్‌ కూడా ఉన్నాయి. డిజిటల్ డ్యాష్‌బోర్డ్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. ఇందులో వెహికిల్‌కి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని చూపిస్తుంది. యానిమేషన్‌తో కూడిన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ డోర్లు LED టెయిల్ ల్యాంప్స్ చూడటానికి బాగుంటాయి.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

స్పెసిఫికేషన్స్‌: Tata Curvv EV రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 45kWh వేరియంట్ 150hp పవర్ అవుట్‌పుట్ మరియు 215Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 15A సాకెట్లు, 72kW AC వాల్ బాక్స్‌లు మరియు DC ఫాస్ట్ ఛార్జర్‌లతో సహా మల్టీ ఛార్జింగ్ ఆప్షన్స్‌కి సపోర్ట్‌ చేస్తుంది.. మరోవైపు, 55kWh వేరియంట్ 167hp హై పవర్ అవుట్‌పుట్ మరియు 215Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

55 kWh వేరియంట్‌ని 70kW ఛార్జర్‌ని ఉపయోగించి సుమారు 40 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యవసర సమయాల్లో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అదనంగా ఇది బై-డైరెక్షనల్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే వాహనం నుండి వాహనం (V2V) మరియు వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్‌కి అనుమతిస్తుంది. ఇతర వాహనాలతో శక్తిని పంచుకోవడం లేదా ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

రెండు వేరియంట్‌లు పర్మినెంట్‌ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ మరియు లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటాయి. వివిధ పరిస్థితులలో ఇది సరైన పనితీరును నిర్ధారిస్తుంది. Curvv EV వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. అలాగే మల్టీ వాయిస్ అసిస్టెంట్‌ కంట్రోల్స్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే కర్వ్‌ ఈవీ భారీ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ కీప్ అసిస్ట్ మరియు 360° సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు కారులో ప్రయాణించే వారికి మెరుగైన సేఫ్టీ ఇతర సౌకర్యాలను అందిస్తాయి. టాటా కార్లలో సేఫ్టీకి తొలి ప్రాధాన్యతను ఇస్తుందని గమనించాలి.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: Tata Curvv EVని నడపడం అనేది ఓ ఆహ్లాదకరమైన అనుభవాని ఇస్తుంది. టార్క్ డెలివరీ (పికప్‌) కోసం ఎకో, సిటీ మరియు స్పోర్ట్ వంటి మల్టీ-డ్రైవ్ మోడ్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక 55kWh వేరియంట్, 167hp హై పవర్ అవుట్‌పుట్‌తో 0 నుంచి 100 KM వేగాన్ని కేవలం కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుంది.

ఈ కారు హై-ఫర్పామెన్స్‌ డ్రైవర్‌లను కూడా సంతృప్తిపరచగల డైనమిక్ మరియు రెస్పాన్సివ్ డ్రైవ్‌ను అందిస్తుంది. మల్టీ-మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు డ్రైవర్‌లు తమ డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా రీజెనరేటివ్ బ్రేకింగ్ స్థాయిని సర్దుబాటు చేయడానికి అనుమతిస్తాయి. కారుపై నియంత్రణ మరియు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

Curvv EV సస్పెన్షన్ సిస్టమ్ లోపల ఉండే ప్రయాణికులు సాఫీగా మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ట్యూన్ చేశారు. మీకు ఎక్కడా ఈ విషయంలో నిరాశకు గురవ్వరు. స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, ఫుల్‌ కంట్రోల్స్‌ లాంగ్ డ్రైవ్‌లను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. వెంటిలేషన్ మరియు డ్యూయల్ కంఫర్ట్ జోన్‌లతో కూడిన అధునాతన కంఫర్ట్ సీట్లు డ్రైవర్ మరియు ప్రయాణీకులు ఇద్దరూ రిలాక్స్‌గా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి.

ఈ కర్వ్‌ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటోఫోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ ORVMలు మరియు ఆటో-డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి హై-ఎండ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది ఆద్యాంతం మంచి డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. AQI డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ క్యాబిన్ కారులో ఎయిర్‌ శుభ్రంగా ఉండేలా చూస్తుంది. ఇది కార్లలో లో క్వాలిటీ ఎయిర్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి ఎంటువంటి ఆందోళన లేకుండా చేస్తుంది.

Tata-Curvv-EV-Full-Review-In-Telugu

చివరగా.. టాటా Curvv EV ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఒక భారీ విప్లవం అనే చెప్పాలి. ఎందుకంటే దీని స్టైలింగ్‌, పనితీరు మరియు అధునాతన సాంకేతికత మీకు మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఇందులోని ది బెస్ట్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఫీచర్లు మిమ్మల్నీ ఎక్కడా అసంతృప్తికి గురిచేయవు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలని చూస్తున్న వారికి ఇది సరైన ఆప్షన్‌గా ఉంది.

రోజు వారి డ్రైవింగ్‌ కోసం 45kWh వేరియంట్ సరిపోతుంది. అయితే మీరు హై ఫర్ఫామెన్స్‌ కోరుకుంటున్నట్లైతే 55kWh వేరియంట్‌ని కొనుగోలు చేయడం ఉత్తమం. Curvv EVలోని ఫీచర్లు, సేఫ్టీ సిస్టమ్, అత్యాధునిక కనెక్టివిటీ ఆప్షన్స్‌, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో బలమైన పోటీదారుగా నిలువనుంది. మొత్తంమీద, Tata Curvv EV సంతృప్తికరమైన మరియు స్థిరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందింస్తుంది. కాబట్టి కళ్లు మూసుకుని కొనేయొచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 13, 2024, 12:00 [IST]
English summary
Tata curvv ev driving impressions specs features and range details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+