Tata Curvv ICE Full Review సరికొత్త డిజైన్‌లోని ఈ టాటా కర్వ్‌ని కొనవచ్చా, లేదా?

టాటా కర్వ్‌ ఎస్‌యూవీ కూపే (Tata Curvv SUV Coupe) సరికొత్త సెగ్మెంట్‌లో భారతీయ కార్ల విభాగంలో విప్లవాలకు నాంది పలికింది. స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో SUV కూపేగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ అద్భుతమైన డిజైన్‌తో టాటా కర్వ్ వాహనదారుల చూపులను దోచేయనుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఈ టాటా కర్వ్‌ ఫుల్‌ ప్యాక్డ్‌ ఫీచర్లతో ఉంది. టాటా మోటార్స్ ఈ మోడల్‌ను అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో ప్రవేశపెట్టింది. దీంతో పాటు మంచి ఫర్ఫామెన్స్‌తో మీకు ఫీల్‌ గుడ్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

తాజాగా ఈ టాటా కర్వ్‌ ఐసీఈ వెర్షన్‌ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఈ టెస్ట్‌డ్రైవ్‌లో ఈ కారు డిజైన్, స్పెసిఫికేషన్స్‌, డ్రైవింగ్ డైనమిక్స్, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి. దీని ఫర్పామెన్స్‌ ఆకట్టుకుందా? ఈ సరికొత్త కారు అసమానమైన స్టైలింగ్‌, ఫంక్షనాలిటీ తదితర అంశాలకు సంబంధించిన ఫుల్‌ రివ్యూపై ఓ లుక్కేయండి.

Tata Curvv ICE Review in Telugu

డిజైన్: టాటా కర్వ్‌ ప్రత్యేకమైన SUV కూపే డిజైన్‌తో ఆటోమోటివ్ మార్కెట్‌లోనే ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన ఫ్రంట్ డిజైన్, అధునాతన రూపాన్ని అందించే LED DRLలను కనెక్ట్ చేయడం ద్వారా మందు భాగం హైలైట్‌గా నిలుస్తుంది. ఇక మెయిన్‌ హెడ్‌ల్యాంప్ యూనిట్స్‌ ఫ్రంట్ బంపర్‌కి రెండువైపులా మంచి పొజీషనింగ్‌లో అందించారు. గ్రిల్‌పై ఉండే క్రోమ్ యాక్సెంట్స్‌ సాఫ్ట్‌నెస్‌ని మరింత పెంచుతాయి.

గ్రిల్ వద్ద ఎయిర్‌ వేస్‌ కూడా ఉన్నాయి. ఇది ఎయిర్‌ ఫ్లోనూ పెంచడం ద్వారా ఇంజిన్ పనితీరును మెరుగుపరచడానికి దోహదపడతాయి. దీని సైడ్ డిజైన్‌లో 18-ఇంచెస్‌ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ (టాప్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది), అసాధారణమైన బ్రేకింగ్ పనితీరు కోసం ఆల్-డిస్క్ బ్రేక్‌లతో SUV కూపే స్టైలింగ్‌కి అద్దం పడతాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఏరోడైనమిక్ అప్పీల్‌ను మెరుగుపరుస్తుంది. ORVMలలోని ఇంటిగ్రేటెడ్‌ ఇండికేటర్స్‌ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి.

Tata Curvv ICE Review

టాటా Curvv స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో విభిన్నమైన స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. దీని వెనుక డిజైన్‌లో కనెక్టింగ్ లైట్ బార్‌ను కలిగి ఉంది. ఇది ముందు భాగం వరకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. టెయిల్ ల్యాంప్స్‌ బంపర్ చివర్లో సొగసైన స్థానంలో ఉండటం వల్ల రియర్‌ వ్యూ లోనూ ఇది అదరగొడుతుంది. వెనక డిజైన్‌ కూడా కారు మంచి లుక్‌తో దర్శనిస్తుంది.

ఇక దీని ఇంటీరియర్‌ విషయానికి వస్తే ఖరీదైన లెదర్ సీట్లు, తోలుతో చుట్టబడిన స్టీరింగ్ వీల్‌తో లగ్జరీయస్‌గా ఉంటుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. 10-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఆడియో కోసం తొమ్మిది JBL స్పీకర్‌లను అందించారు.

Tata Curvv ICE

అయితే, ఈ కర్వ్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎత్తుగా ఉండే ప్రయాణీకులు వాలుగా ఉన్న రూఫ్‌లైన్ కారణంగా దీని హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ స్పేస్‌ లిమిట్‌ చేయబడింది. దీంతో మీరు వాహనంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లే సమయంలో సవాలుగా ఉంటుంది. ఇది అసౌకర్యానికి దారితీయవచ్చు. 6-స్టెప్స్‌ ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, దూర ప్రయాణాలలో సౌకర్యవంతంగా ఉంటాయి.

ఇక వెల్‌కమ్, గుడ్‌బై యానిమేషన్‌లతో కూడిన సీక్వెన్షియల్ LED DRLs, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, మూడ్ లైటింగ్‌, వాయిస్-అసిస్టన్స్‌ పనోరమిక్ సన్‌రూఫ్ లగ్జరీయస్‌ అనుభూతితో పాటు కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇందులోని ఇతర ఇంటీరియర్‌ ఫీచర్లు డ్రైవర్‌తో సహా ప్రయాణీకులకు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

Tata Curvv ICE Review in Telugu

సేఫ్టీ: టాటా Curvvలో సేఫ్టీ కోసం లెవల్‌ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)ని అందించారు. ఇది అధునాతన సేఫ్టీ ఫీచర్లతో రూపొందించబడింది. ఇది స్టాప్ & గోతో కూడిన అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW), లేన్ కీప్ అసిస్ట్ (LKA), 360° 3D సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌ను కలిగి ఉంది. ఇది డ్రైవర్లు పూర్తి దృష్టిని కేంద్రీకరించే విధంగా ఉంటుంది.

ఇంజిన్‌: Curvv రెండు పెట్రోల్, ఒక డీజిల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్‌ ఇంజిన్ 125 ps పవర్‌ని, 225 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.2-లీటర్ రెవోట్రాన్ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్ 120 ps శక్తిని, 170 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. 1.5-లీటర్ క్రియోజెట్ డీజిల్ ఇంజిన్, 118 ps పవర్‌ని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Curvv ICE Review in Telugu

టాటా Curvvలో అధునాతన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది. ఇది దాని డీజిల్ లైనప్స్‌లోనే మొదటిది. ఇది ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవం కోసం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా కలిగి ఉంది. దీనిలో మూడు మల్టీ-డ్రైవ్ మోడ్స్‌ ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్-డ్రైవర్స్ ప్రాధాన్యతల ప్రకారం మార్చుకోవడానికి అనుమతిస్తుంది. కర్వ్ ఆరు విభిన్న కలర్స్‌లో అందుబాటులో ఉంది.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: టాటా Curvv దాని పనితీరుతో ఆకట్టుకుంటుంది. 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది, ముఖ్యంగా స్పోర్ట్ మోడ్‌లో, ఇది వివిధ డ్రైవింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. హైవేలపై అధిక టార్క్ అవుట్‌పుట్‌ కోసం, సిటీలలో మంచి డ్రైవింగ్‌ కోసం డీజిల్‌ ఇంజిన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. దీనిలోని 7-స్పీడ్ DCA గేర్‌బాక్స్ సరికొత్త డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

Tata Curvv ICE Review in Telugu

Curvv సస్పెన్షన్ బాగుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్-కీపింగ్ అసిస్ట్ సహా మంచి సేఫ్టీని పొందవచ్చు. డ్రైవర్ సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రయాణీకులకు సపోర్టివ్ రియర్ సీట్లు ప్రయాణికులకు అనువుగా ఉంటాయి. అయితే వెనుక హెడ్‌రూమ్‌ను పరిమితం చేయడం వల్ల పొడవున్న ప్రయాణీకులకు ఇబ్బంది ఉంటుంది. మొత్తంమీద సౌకర్యవంతమైన ఇంకా పనితీరు కోరుకునే వారికి ఇది సరిపోతుంది.

చివరగా: టాటా Curvv అనేది SUV మార్కెట్‌లో ఆకట్టుకునే ఓ కొత్త కారు అని చెప్పవచ్చు. దీనిలోని సొగసైన కూపే లాంటి స్టైలింగ్‌, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ లైటింగ్, విలాసవంతమైన ఇంటీరియర్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతే కాకుండా మల్టీపుల్‌ డ్రైవ్స్‌ మోడ్స్, లెవల్‌ 2 ADAS టెక్నాలజీ ఇతర ఫీచర్లతో ఇది ఆల్‌రౌండర్‌గా ఉంటుంది.

Tata Curvv ICE Review in Telugu

కొత్త డిజైన్ మార్పుల వల్ల పొడవాటి ప్రయాణీకులకు స్థలాన్ని పరిమితం చేయబడ్డాయి. ఇది దీనిలోని మైనస్‌ పాయింట్‌గా చెప్పవచ్చు. అధునాతన సాంకేతికత, సేఫ్టీ ఫీచర్లు Curvvని టాప్‌లో నిలబెట్టాయి. డిజైన్, కంఫర్ట్ ప్రాధాన్యతనిచ్చే వారికి ఇదొక మంచి ఆప్షన్. అంతే కాకుండా కూపే స్టైల్‌ ఎస్‌యూవీ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు టాటా కర్వ్‌ ది బెస్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, September 19, 2024, 12:00 [IST]
English summary
Tata curvv ice review driving impressions and specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+