Tata Harrier EV Review : సింగిల్ ఛార్జ్‌తో 622 కి.మీ. రేంజ్..టాటా హారియర్ ఈవీ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
Tata Harrier EV Review : భారతీయ ఈవీ మార్కెట్లోకి టాటా మోటార్స్ హారియర్ ఈవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర RWD వేరియంట్‌కు రూ.21.5లక్షలు, టాప్ స్పెక్ క్వాడ్ AWD మోడల్‌కు రూ.30.3 లక్షల(ఎక్స్-షోరూమ్) ఉంది. రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్లు, అడ్వాన్సుడ్ ADASఫీచర్‌లు, 14.5అంగుళాల టచ్‌స్క్రీన్, పెద్ద బ్యాటరీ వెర్షన్‌తో 622కి.మీ రేంజ్ వంటివి ఉన్నాయి. రోడ్డు మీద దాని పర్ఫామెన్స్ ఎలా ఉందో చూద్దాం.
ధర, వేరియంట్స్, రేంజ్
భారతీయ ఈవీ మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర RWD వేరియంట్‌కు రూ.21.5లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-స్పెక్ క్వాడ్ AWDమోడల్‌కు రూ.30.3లక్షల వరకు ఉంటుంది. డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కెపాసిటీ, ప్రీమియం ఇంటీరియర్స్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టి హారియర్ ఈవీని తయారు చేశారు. కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఏ వేరియంట్‌నైనా సెలక్ట్ చేసుకోవచ్చు.

హారియర్ ఈవీ డిజైన్
టాటా హారియర్ ఈవీ ముందు భాగంలో సాధారణ డీజిల్ మోడల్‌లో ఉండే ఓపెన్ గ్రిల్ ఉండదు. దానికి బదులుగా బాడీ రంగులో ఉన్న గ్రిడ్ పైన LED DRL స్ట్రిప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ DRLలలోనే డైనమిక్ ఇండికేటర్స్ కలిసిపోయాయి. లైటింగ్ కోసం, బైఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన కంప్లీట్ LED సెటప్ ఉంటుంది.
హెడ్‌లైట్ల దగ్గర ఉన్న ఎయిర్ వెంట్స్ బ్రేక్, టైర్ కూలింగ్ కోసం గాలి ప్రవాహాన్ని నిర్దేశిస్తాయి. ఇది ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరుస్తుంది. ముందు భాగంలో ఉన్న రాడార్, కెమెరా లెవెల్ 2 ADAS ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. పక్క నుండి చూస్తే ఇది స్టాండర్డ్ హారియర్‌ను పోలి ఉంటుంది. స్పెషల్ ఈవీ బ్యాడ్జింగ్, తక్కువ రోలింగ్ నాయిస్ కోసం ఈవీ నిర్దిష్ట టైర్‌లతో కూడిన 19-అంగుళాల ఏరో వీల్స్ ఉన్నాయి.

పియానో బ్లాక్ రూఫ్ రైల్స్, క్రోమ్ లేకపోవడం వల్ల ఈ ఎస్‌యూవీకి ఒక నీట్, లేటెస్టు లుక్ ఇస్తుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు, రూఫ్ స్పాయిలర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, నలుపు రంగులో Harrier.EV బ్యాడ్జ్ ఉన్నాయి. హ్యాండ్స్-ఫ్రీ బూట్ 502లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది. ఫ్రంట్ ట్రంక్ RWD మోడల్‌లలో 67లీటర్ల వరకు, AWD వేరియంట్లో 35లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది.
ఇంటర్నల్ డిజైన్
హారియర్ ఈవీ క్యాబిన్ అద్భుతంగా రూపొందించారు. వెనుక సీటులో కూర్చునే వారికి పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మాన్యువల్ వెనుక విండో సన్‌షేడ్‌లు, చాలా విశాలమైన లెగ్‌రూమ్ ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లాంగ్ టూర్లలో కూడా ఎక్స్ ట్రా సపోర్ట్ కోసం అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి.

కప్ హోల్డర్‌లతో కూడిన ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్ వెనుక భాగంలో ఉంటుంది. మిడిల్ సీటుకు హెడ్‌రెస్ట్ లేదు. అయితే బాస్ మోడ్ ఫంక్షన్ వెనుక ప్రయాణీకులను ముందు ప్రయాణీకుల సీటును ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనుక ప్రయాణీకులకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ C పోర్ట్‌లు, ఎక్స్ ట్రా స్టోరేజీ స్పేస్ కూడా లభిస్తుంది.
ముందు భాగంలో హారియర్ ఈవీ వెనుక డాష్‌క్యామ్‌గా పనిచేసే ఇంటిగ్రేటెడ్ కెమెరాతో కూడిన డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్ ఉంటుంది. రికార్డింగ్ కోసం మిర్రర్‌లో ముందు కెమెరా కూడా ఉంది. 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, అమెజాన్ అలెక్సాకు సపోర్ట్ ఇస్తుంది. వెదర్, వెహికల్ సెట్టింగ్‌లతో సహా అనేక రకాల కంట్రోల్స్ అందిస్తుంది.

ఏసీ వెంట్స్ కింద టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టాండర్డ్ ఫీచర్. 360-డిగ్రీల కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫాస్ట్-ఛార్జింగ్ పోర్ట్‌లు కారును కనెక్ట్ చేస్తాయి. ఆఫ్-రోడ్ మోడ్ సెలెక్టర్ మంచు, బురద, ఇసుక మోడ్ సెట్టింగ్‌లను అందిస్తుంది. ఎకో, బూస్ట్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. బూస్ట్ మోడ్ పూర్తి 390bhp అవుట్‌పుట్ అందిస్తుంది.
ముందు సీట్లు వెంటిలేటెడ్, ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ కుట్లతో డ్యూయల్-టోన్ అప్‌హోల్‌స్టరీతో వస్తాయి. డాష్‌బోర్డ్ కార్బన్ ఫైబర్‌ను పోలి ఉండే టెక్చర్ను కలిగి ఉంటుంది, ఇది ప్రీమియం ఎక్సపీరియన్స్ పెంచుతుంది. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ టిల్ట్, టెలిస్కోపిక్ రీచ్ కోసం అడ్జస్ట్ చేస్తుంది, ఎట్రాక్టివ్ లోగోలు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. కీ లెస్ ఎంట్రీకి B-పిల్లర్, క్యాబిన్ లోపల సెన్సార్‌లతో ఉంటుంది.

బ్యాటరీ, పవర్, రేంజ్
హారియర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి 65 kWh, 75 kWh. RWD వేరియంట్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే క్వాడ్-మోటార్ AWD సెటప్ కేవలం పెద్ద 75 kWh ప్యాక్‌తో మాత్రమే లభిస్తుంది. టాప్ వేరియంట్ 390 bhp పవర్, 505 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6 సెకన్లలోపు 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.
65 kWh బ్యాటరీతో RWD వేరియంట్ 538కిమీ రేంజ్ ఇస్తుంది. 75 kWh బ్యాటరీ వెర్షన్‌లకు 622 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. రియల్ టైం మాత్రం పెద్ద బ్యాటరీకి 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఉండొచ్చు.

డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్
హారియర్ ఈవీ ముఖ్యంగా బూస్ట్ మోడ్‌లో వేగంగా పిక్-అప్ ఇస్తుంది. ఇది సిటీ, హైవే డ్రైవింగ్‌లో చాలా బాగా రెస్పాండ్ అవుతుంది.. సస్పెన్షన్ ఫెసిలిటీ చాలా బాగా ఇచ్చారు. ఇది స్మూత్ రైడ్ ఇస్తుంది.
ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ వివిధ భూభాగాలకు తగ్గట్లు సెలక్టెడ్ డ్రైవ్ మోడ్‌లతో ఆఫ్-రోడ్ డ్రైవింగ్ బాగుంది. బ్రేకింగ్ పర్ఫామెన్స్ బాగానే ఉంది. నాలుగు డిస్క్ బ్రేక్‌లు, సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అయితే, మొదటిసారి ఈ కారు నడిపే వాళ్లకు బ్రేక్ పెడల్ కొద్దిగా స్మూతుగా ఉంటుంది. కొంతమంది డ్రైవర్లకు దీనికి అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది.

ఛార్జింగ్ ఆప్షన్లు
స్టాండర్డ్ 3.3 kW వాల్ ఛార్జర్ (75 kWh బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయడానికి దాదాపు 30 గంటలు), 7.2 kW హోమ్ ఛార్జర్ (12-15 గంటలు), 120 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ (దాదాపు 25 నిమిషాల్లో 0-80% ఛార్జ్). సిటీల్లో ఉన్న టాటా 60 kW ఫాస్ట్ ఛార్జర్ల నెట్‌వర్క్ చాలా మంది వినియోగదారులకు టాప్-అప్‌లను ఈజీ చేస్తుంది.
ఫైనల్‌గా
టాటా హారియర్ ఈవీ రేంజ్, పర్ఫార్మెన్స్, ఫీచర్లన్నీ కలిసి ఉన్న కంప్లీట్ ఎస్యూవీ. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విశాలమైన, సౌకర్యవంతమైన, మంచి ఫీచర్లు ఉన్న ఫ్యామిలీ వెహికల్ కోసం చూస్తున్న వారికి, అలాగే లాంగ్-రేంజ్ కెపాసిటీ, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కావాలనుకునే వారికి సరిపోతుంది.

దీని లేటెస్ట్ డిజైన్, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు, ఈజీ ఛార్జింగ్ సొల్యూషన్‌లతో ఈ సెగ్మెంట్లో ఒక మంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం చూస్తున్న ఎవరైనా హారియర్ ఈవీని ఖచ్చితంగా కొనుగోలు చేయవచ్చు. టాటా విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, ఈవీలకు సపోర్టు ఇవ్వాలనే వారు ఈ కారును రికమెండ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








