Tata Punch EV Full Review: టాటా పంచ్ ఈవీ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ రేంజ్, పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ..!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల యుగంలో టాటా మోటార్స్(Tata Motors) హవా నడుస్తోంది. టాటా పంచ్ ఈవీ లాంచ్‌తో ఇప్పటి వరకూ టాటా మోటార్స్ నుంచి నాలుగు ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యాయి. నెక్సాన్ EV లైనప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత.. ఈ సంస్థ మెక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్ ఈవీ(Tata Punch EV)ని భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది.
టాటా పంచ్ ICEకి కూడా మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లోకి టియాగో, టిగోర్, నెక్సాన్ ప్రవేశించగా.. ఇప్పుడు మెక్రో SUV టాటా పంచ్ EV ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీగా ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ కారును బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు ఆహ్వానం లభించింది. డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ పూర్తి రివ్యూ ఈ కథనంలో..

డిజైన్: టాటా పంచ్(Tata Punch EV Review) ఈవీ మొదటి లుక్‌లో దాని తోబుట్టువు ICE మాదిరిగా కనిపిస్తుంది. అయితే డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఫ్రంట్ బంపర్‌ను మార్చారు. 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ మరియు కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కూల్‌గా ఉంచడానికి మినిస్క్యూల్ ఇన్‌టేక్‌లను చూడవచ్చు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ కోసం టాటా బ్యాడ్జ్ వెనుక హాచ్‌ను ఏర్పాటు చేశారు.
ఎక్స్‌టీరియర్: టాటా పంచ్ EVలో LED DRLలు పూర్తి వెడల్పుగా.. SUV ముందు భాగంలో ఆకర్షణీయంగా విస్తరించి ఉన్నాయి. ఇంకా హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు కార్నరింగ్ లైట్లు ఫ్రంట్ బంపర్ అంచులలో వరుసగా ఉంటాయి. కారు డోర్లపై EV బ్యాడ్జింగ్‌తో పాటు 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పంచ్ ICE వెర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉంటాయి.

ఇంటీరియర్: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ విషయానికొస్తే క్యాబిన్‌లో చాలా మార్పులు చేశారు. ఫీచర్ల పరంగా టాటా పంచ్ ఈవీలో రెండు 10.25-అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇన్‌స్ట్రుమెంటేషన్.. 2-స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక ఉండగా.. మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇది మీకు మీ సాధారణ కనెక్టివిటీ మరియు ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్ల కోసం ఉపయోగించుకోవచ్చు.
టాటా పంచ్ ఈవీ(Tata Punch EV Price) ఇంటీరియర్ డ్యూయల్-టోన్ లుక్‌ను కలిగి ఉంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన కారులో ఇంటీరియర్ తెలుపు మరియు నలుపు రంగుల్లో ఉంది. ఈ కలర్స్ కారు ఇంటీరియర్ లుక్‌కు మరింత ప్రీమియంను జోడించింది. రెండు స్విచ్‌లతో కూడిన కొత్త టాటా కెపాసిటివ్ యూనిట్లు AC కంట్రోలింగ్ ఇంకా కొన్ని ఫంక్షన్ల కోసం అందించారు.

ఈ ఆప్షన్ ద్వారా మీరు ఛార్జింగ్ పోర్ట్ హాచ్‌ని తెరవవచ్చు. ఇంకా టచ్ ప్యానెల్ కింద ఛార్జింగ్ పోర్ట్‌లు (12Vతో పాటు USB A & C)ను ఏర్పాటు చేశారు. టాటా పంచ్(Tata Punch EV Features) ఈవీలో ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి వెంటిలేటెడ్ సీట్లతో వస్తాయి. ఫ్రంట్ సీట్ల మధ్య ఇక సెంట్రల్ కన్సోల్‌లో గేర్ సెలెక్టర్ ఆకర్షణీయంగా ఉంది.
కాగా కప్‌హోల్డర్‌ల పక్కన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూర్చుని ఉంది. దాని పక్కనే డ్రైవ్ మోడ్ బటన్‌లను సంస్థ అందించింది. ఇకా కొత్త టాటా పంచ్ EV వెనుక సీట్లలోకి వెళితే.. ఇక్కడ పెద్దగా మార్పులను చూడలేము. బెంచ్ సీటు టాటా పంచ్ ICE మాదిరిగానే రెండు హెడ్‌రెస్ట్‌లతో ఉండగా.. ఆర్మ్‌రెస్ట్ కప్‌హోల్డర్‌ను కోల్పోతుంది. అయితే ఆరు అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారికి.. హెడ్‌రూమ్ కొంచెం సమస్యగా అనిపిస్తుంది.

ఇక బూట్ స్పేస్ విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌కి మారడంతో టాటా పంచ్ ఈవీలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. టాటా పంచ్ ఈవీలో బూట్ స్పేస్ 366 లీటర్లుగా ఉంది. టాటా పంచ్ ఈవీని కొత్త acti.ev ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌కు ఆధారంగా నిర్మించడంతో దీనికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఈ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ టాటా యొక్క జీరో-ఎమిషన్స్ కార్లన్నింటికీ మద్దతు ఇస్తుండటం విశేషం.
కొలతల పరంగా టాటా పంచ్ EV 3,857mm పొడవు, 1,742mm వెడల్పు మరియు 1,633mm ఎత్తుతో పాటు 2,445mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉండగా.. పంచ్ ఎలక్ట్రిక్ కారు దాని ICE తోబుట్టువు కంటే 30mm పొడవు మరియు 18mm ఎత్తు ఎక్కువగా ఉంది.

బ్యాటరీ ప్యాక్: టాటా పంచ్ ఈవీని acti.ev ప్లాట్‌ఫారమ్ ఆధారంగా లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు. బేస్ పంచ్ EV 80.46 bhp మరియు 114 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది 315 km MIDC పరిధితో 25 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
టాప్-స్పెక్ పంచ్ EV లాంగ్ రేంజ్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 421km రేంజ్‌ను ఇచ్చేలా 35 kWh బ్యాటరీని ఉపయోగించారు. ఇది 120.7 bhp మరియు 190 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసేలా.. మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఇందులో ఉపయోగించారు.

కాగా టాటా పంచ్ EV యొక్క లాంగ్ రేంజ్ వెర్షన్ కేవలం 9.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. కాగా లాంగ్ రేంజ్ వెర్షన్ కారు గంటకు 140కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. టాటా పంచ్ EV యొక్క అన్ని వెర్షన్లలో బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసేందుకు 3.3kWh ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను సంస్థ అందిస్తోంది.
టాటా పంచ్ ఈవీ స్టాండర్డ్ వెర్షన్‌లో 9.4 గంటల్లో బ్యాటరీ పూర్తి ఛార్జ్ అవుతుండగా.. లాంగ్-రేంజ్ వెర్షన్‌లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 13.5 గంటల సమయం తీసుకుంటుంది. కాగా వేగవంతమైన 7.2kWh ఛార్జర్.. స్టాండర్డ్ వెర్షన్‌లో దీన్ని 3.6 గంటలకు, లాంగ్ రేంజ్ వేరియంట్‌లో ఐదు గంటలకు తగ్గిస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు: భద్రత విషయానికొస్తే టాటా పంచ్ ఈవీలో ఫుల్ ప్యాక్డ్ సేఫ్టీ ఫీచర్లను చూడవచ్చు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, చుట్టూ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్‌తో సహా అనేక సేఫ్టీ కిట్ ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: ఇక టాటా పంచ్ ఈవీని టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు.. ప్రయాణంలో స్పోర్ట్స్ మోడ్‌లోకి ప్రవేశించిన తర్వాత, టాటా పంచ్ EV చాలా స్పష్టతను కలిగి ఉంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్ మోడ్‌ల మధ్య చాలా తేడా ఉంది. ఎకో మోడ్‌లో, మీరు యాక్సిలరేటర్‌పై నొక్కినప్పుడు రియాక్షన్ కొంచెం ఆలస్యంగా కనిపిస్తుంది. అయితే సిటీ మోడ్ కొంచెం సింపుల్‌గా అనిపిస్తుంది. దీని ద్వారా డ్రైవింగ్ చేసేటప్పుడు స్పోర్ట్స్ మోడ్‌లో ఉండటం బెటర్ అనిపిస్తుంది.

సస్పెన్షన్ సెటప్: పంచ్ EVలో సస్పెన్షన్ సెటప్ దాని ICE వెర్షన్ మాదిరిగానే కొంచెం గట్టిగా ఉండటాన్ని గమనించవచ్చు. అయితే, రైడ్ మరియు హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ మధ్య సున్నితమైన బ్యాలెన్స్ ఉండటం డ్రైవింగ్‌లో సౌకర్యంగా అనిపించింది. గరుకు రోడ్లపై వేగంగా ప్రయాణించినా ఒడుదొడుకులు లేకుండా స్థిరంగా ప్రయాణిస్తుంది. టాటా పంచ్ ఈవీ స్టీరింగ్ కొంచెం బరువుగా ఉండటం ద్వారా.. మీరు ఏ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నా మీకు మంచి అనుభూతిని ఇస్తూ స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తుంది.
పదునైన, ఖచ్చితమైన హ్యాండ్లింగ్ లక్షణాల కారణంగా టర్నింగుల్లోనూ సులువుగా ప్రయాణించవచ్చు. బ్రేకింగ్ కూడా సహజంగా అనిపించడం ద్వారా ప్రయాణంలో ఇబ్బంది అనిపించదు. స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించి నాలుగు రీజెన్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. అయితే టైం లిమిట్ కారణంగా మేము టాటా పంచ్ ఈవీ రియల్ టైమ్ రేంజ్‌ను పరీక్షించలేకపోయాము.

చివరిగా టాటా పంచ్ EVని కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించడం కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది మార్పు కోసం మరో ముందడుగు అని సూచిస్తుంది. మేము టెస్ట్ డ్రైవింగ్‌లో టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్‌ను టెస్ట్ డ్రైవ్ చేశాం. కాగా టాటా ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే కనీసం 300 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని మేము అంచనా వేశాం.

టాటా మోటార్స్ ఇంత వేగంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దూసుకుపోవడం ఆశ్చర్యకరమే.. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో టాటా పంచ్ ఈవీ అందుబాటులో ఉంది. 100 శాతం పర్యావరణ హితంగా ఉండే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునేవారికి టాటా పంచ్ ఈవీని ఓ సారి పరిశీలించవచ్చు. అయితే ఆరు అడుగుల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్న వ్యక్తులు వెనుక సీట్లలో కూర్చోకుండా ఉండాలని మేము సూచిస్తున్నాం.


Click it and Unblock the Notifications








