Tata Tiago EV రివ్యూ.. మీ ప్రశ్నలన్నింటికీ చక్కని సమాధానం

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా పరుగులు తీస్తోంది. కంపెనీ ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ 'టియాగో ఈవి' ని మార్కెట్లో విడుదల చేసింది. ఇది ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ విభాగంలో సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్.

ఇటీవల మేము సుందరమైన గోవా వీధుల్లో సరికొత్త 'టాటా టియాగో ఈవి' (Tata Tiago EV) ని డ్రైవ్ చేసాము. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి గతంలో మనం కొన్ని కథనాల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ రివ్యూలో టాటా టియాగో ఈవి డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి మరియు రేంజ్ వంటి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

Tata Tiago EV రివ్యూ

టాటా టియాగో EV డిజైన్:

టాటా మోటార్స్ యొక్క 'టియాగో ఈవి' మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వంటి వాటిలో టీల్ బ్లూ యాక్సెంట్స్ గమనించవచ్చు. టియాగో ఈవి యొక్క ముందు భాగంలో ఉన్న గ్రిల్ బ్లాక్ ప్లాస్టిక్‌లో ఉంటుంది. అదే సమయంలో దానికి మధ్యలో బ్రాండ్ లోగో చూడవచ్చు. దానికి పక్కనే ఈవి బ్యాడ్జ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

హెడ్‌లైట్‌లు క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ కింద టీల్ బ్లూ స్టిప్ ద్వారా ఒకదానితో మరొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. అయితే DRL లు మాత్రం ఫ్రంట్ బంపర్‌లో తక్కువగా ఉంటాయి, ఇందులో కూడా స్పోర్ట్ టీల్ బ్లూ హైలైట్‌లు గమనించవచ్చు. సైడ్ ప్రొఫైల్ లో పియానో బ్లాక్ స్ట్రిప్‌తో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్‌ ఉన్నాయి. అదే సమయంలో ఇది కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్ పొందుతుంది.

Tata Tiago EV రివ్యూ

టాటా టియాగో ఈవి 14 ఇంచెస్ హైపర్‌స్టైల్ వీల్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో కూడా టీల్ హైలైట్‌లను గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. EV బ్యాడ్జింగ్ మినహా ఎటువంటి పెద్ద అప్డేట్స్ లేదని తెలుస్తుంది. మొత్తం మీద డిజైన్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటీరియర్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

టాటా టియాగో EV ఫీచర్స్:

టాటా టియాగో ఈవి ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఏసీ వెంట్స్ చుట్టూ టీల్ యాక్సెంట్‌లను చూడవచ్చు.

Tata Tiago EV రివ్యూ

కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రోమ్ ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ వంటి వాటితో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ టాటా యొక్క ZConnect 45 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా టెలిమాటిక్స్ యాక్సెస్ కూడా ఉంది. కావున వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్స్ తో, లేదా స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.

టాటా టియాగో ఈవి యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఇతర వాహనాల మాదిరిగానే ఇది కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో ప్రయాణికుల సేఫ్టీకి ఎటువంటి లోటు లేదు.

టాటా టియాగో EV పవర్‌ట్రెయిన్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

టాటా టియాగో ఈవి రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్సన్స్ పొందుతుంది. అవి 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్స్. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250 కిమీ పరిధిని (రేంజ్) అందిస్తుంది. Tiago EV యొక్క ఈ వెర్షన్ 60.3 బిహెచ్‌పి పవర్ మరియు 110 ఎన్ఎమ్ టార్క్ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇది స్టాండర్డ్ 3.3 కిలోవాట్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది.

మేము 3.3kWh మరియు 7.2Kwh AC హోమ్ ఛార్జింగ్ ఆప్షన్‌లతో అందించబడే పెద్ద 24kWh బ్యాటరీ ప్యాక్‌ కలిగిన Tiago EV ని డ్రైవ్ చేసాము. Tiago EV యొక్క రెండు వెర్షన్లు 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 57 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్ 73.75 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ టార్క్‌ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఈ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట పరిధి 315 కిమీ.

టాటా టియాగో ఈవి డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. అవి సిటీ మోడ్ మరియు స్పోర్ట్ మోడ్. ఈ రెండు మోడ్స్ మధ్య వ్యత్యాసం కూడా డ్రైవింగ్ సమయంలో గుర్తించవచ్చు.అంతే కాకుండా Tiago EV మోడ్ 0 నుండి మోడ్ 3 వరకు నాలుగు స్థాయిల రీజెన్‌లను అందిస్తుంది. మోడ్ 0 లో, రీజెన్ ఉనికిలో అంతగా ఉండదు, అయితే మోడ్ 3 సింగిల్-పెడల్ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది.

టియాగో ఈవి యొక్క బ్యాటరీ ఛార్జ్ 80 శాతానికి మించి ఉంటే రీజెన్ అందుబాటులో ఉండదు. అంతే కాకుండా Tiago EV యొక్క క్రీప్ మోడ్ బంపర్-టు-బంపర్ మరియు స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవింగ్‌ని అనుమతిస్తుంది. డ్రైవింగ్ సమయంలో స్టీరింగ్ చాలా తేలికగా మరియు తక్కువ వేగంతో మరియు సిటీ ట్రాఫిక్‌లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

టియాగో EV మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది, కావున గుంతలు వంటి రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అతి తక్కువ బాడీ రోల్ కారణంగా టియాగో EV మూలల్లో చాలా స్థిరంగా ఉందని మేము కనుగొన్నాము. బ్రేకింగ్ సిస్టం కూడా అద్భుతంగా ఉంది.

టాటా టియాగో ఈవి యొక్క క్లెయిమ్‌ రేంజ్ టెస్ట్ చేయలేకపోయాము. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్ వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో దాదాపు 220 కిమీ నుండి 230 కిమీ పరిధిని తప్పకుండా అందించే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. మొత్తం మీద టాటా టియాగో ఈవి డ్రైవింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది.

'టాటా టియాగో EV' పై మా అభిప్రాయం:

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూసేవారికి టాటా టియాగో ఈవి తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇక రేంజ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు, కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2022, 10:11 [IST]
English summary
Tata tiago ev first drive review design features and driving impressions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+