Tata Tigor iCNG AMT Review టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీ ఏఎంటీ డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

దేశంలో ప్యాసింజర్‌ కార్ల విభాగంలో టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీ(Tata Tigor iCNG) వెర్షన్‌ మంచి ఆదరణ పొందుతోంది. లాంచ్‌ సమయంలో టాటా మోటార్స్‌ టిగోర్‌ సీఎన్‌జీని కేవలం మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే ప్రవేశపెట్టింది. కాగా మార్కెట్లో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గత నెలలో టాటా టిగోర్‌ ఆటోమేటిక్(AMT) గేర్‌బాక్స్‌ను సంస్థ లాంచ్ చేసింది.

టాటా మోటార్స్ Tigor iCNGని 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అప్‌డేట్‌ చేసి గత నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో ఇది దేశంలోనే మొదటి CNG ఆటోమేటిక్ సెడాన్‌గా నిలిచింది. కాగా టిగోర్‌ ఐసీఎన్‌జీ ఆటోమేటిక్‌ వెర్షన్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ను టాటా మోటార్స్‌ ఆహ్వానించింది. ఈ కారు పనితీరు, డిజైన్, ఫీచర్లు పూర్తి రివ్యూ ఈ కథనంలో..

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

ముందుగా డిజైన్‌ విషయానికొస్తే టాటా టిగోర్‌ iCNG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీలోని అదే హెడ్‌లైట్‌, ఫాగ్‌లైట్‌ సెటప్‌తో పాటు ముందు భాగంలో అదే LED DRL లను చూడవచ్చు. కారు ముందు భాగంలో క్రోమ్ మరియు పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని ద్వారా టిగోర్‌కు ప్రీమియం లుక్‌ను జోడిస్తుంది.

టాటా టిగోర్‌ సీఎన్‌జీ ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్‌మిషన్‌ సెడాన్‌లో సైడ్స్‌ విషయానికొస్తే.. డోర్ హ్యాండిల్స్ మరియు విండో ట్రిమ్‌లపై క్రోమ్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఇందులోనూ అదే 14-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండటం ద్వారా దాదాపుగా డిజైన్‌లో మార్పులు ఏమీ కనబడవు.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

టిగోర్‌ ఐసీఎన్‌జీ వెనుక భాగంలో, కొన్ని క్రోమ్ ఫినిషింగ్ మరియు స్పష్టమైన లెన్స్ టెయిల్‌లైట్‌లను చూడవచ్చు. హాలోజన్, LED ల మిక్స్ అండ్ మ్యాచ్ సెటప్‌తో ఆకట్టుకునేలా ఉంటాయి. కనెక్ట్ చేయబడిన స్పాయిలర్ మరియు పెద్ద LED స్టాప్‌లైట్‌, షార్క్-ఫిన్ యాంటెన్నాతో వస్తుంది. ఇంకా టెయిల్‌గేట్‌కి రెండు వైపులా Tigor మరియు iCNG బ్యాడ్జ్‌లతో వస్తుంది. పార్కింగ్‌లో ఇబ్బంది తలెత్తకుండా.. గుడ్‌ క్వాలిటీ రివర్స్ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

టాటా టిగోర్‌ iCNG AMT వెర్షన్‌ ఇంటీరియర్‌ విషయానికొస్తే.. AMT గేర్ లివర్ మినహా టిగోర్ iCNG క్యాబిన్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ వెర్షన్‌ మాదిరిగానే ఉంటుంది. అదే డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉండగా.. AC వెంట్స్ బాడీ-కలర్ ట్రీట్‌మెంట్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా అదే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం అదే డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా కేవలం CNG ఫ్యూయెల్‌ లెవలర్ మాత్రమే ఉంది.

కాగా మీరు టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీని స్టార్ట్‌ చేసినప్పుడు.. ఎల్లప్పుడూ ముందుగా CNGలోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్‌కి మారాలనుకుంటే ఇందుకోసం ఇంటీరియర్‌లో ప్రత్యేకంగా ఓ బటన్ ఉంటుంది. సీట్లు డిజైన్‌, లుక్‌ కూడా ఐసీఎన్‌జీ మాన్యువల్‌ మాదిరిగానే ఉంటుంది. ఇది డ్యూయల్-ట్యాంక్ CNG వాహనం అయినప్పటికీ.. బూట్‌ స్పేస్‌ అధికంగానే ఉంటుంది. ఈ రెండు CNG ట్యాంకుల సామర్థ్యం 70-లీటర్లు ఉంటుంది.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే... టాటా టిగోర్ iCNG AMT అదే 1.2-లీటర్ Revotron పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CNG మోడ్‌లో 73.4PS శక్తిని మరియు పెట్రోల్ మోడ్‌లో 86PS శక్తిని ఉత్పత్తి చేస్తుండగా.. గరిష్ఠ టార్క్‌ అవుట్‌పుట్‌ 95 NM వద్ద అలాగే ఉంటుందని గమనించాం. ప్రస్తుతం ఈ ఇంజిన్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంది.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

ఇప్పుడు టిగోర్‌ ఐసీఎన్‌జీ AMT గేర్‌బాక్స్‌ను పనితీరును పరిశీలించినట్లయితే.. ఇది కొంచెం నెమ్మదిగా ఉన్నా.. తన విధులను సక్రమంగా నిర్వహిస్తోంది. తక్కువ ధరలో అధిక మైలేజ్‌ను పొందేందుకు చాలా మంది సీఎన్‌జీ కారుకు ప్రాధాన్యత ఇస్తారు. వారి కోసం ఈ టాటా టిగోర్‌ iCNG AMT వెర్షన్‌ మంచి ఆప్షన్‌. ట్రాఫిక్‌ రోడ్లపై ఈ ఆటోమేటెడ్‌ వెర్షన్‌లు.. మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

కాగా టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీ ఆటోమేటిక్ మోడ్‌లోని అప్‌షిఫ్ట్‌లు నిజంగా లాగీగా అనిపించినా.. ఫ్లిప్ సైడ్‌లో, మీరు మాన్యువల్ మోడ్‌కి మారిన తర్వాత, డౌన్‌షిఫ్ట్‌లలో రియాక్షన్‌ కొద్దిగా పెరుగుతుంది. కాగా కారు లీనియర్ యాక్సిలరేషన్ మరియు మంచి టాప్ ఎండ్‌ను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

ఇక టాటా టిగోర్‌ iCNG AMT సస్పెన్షన్ సెటప్ అలాగే ఉంటుంది. కానీ సాధారణ పెట్రోల్ టియాగో కంటే భిన్నంగా ఉండటాన్ని గమనించాం. CNG ట్యాంకుల బరువును తీసుకునేలా దీనిని సంస్థ సర్దుబాటు చేసింది. కాగా టాటా టిగోర్‌ ఐసీఎన్‌జీ AMT మూడెంకల వేగంతో ప్రయాణించేలా టాటా మోటార్స్‌ ఇంజిన్‌ను రూపొందించింది.

మార్కెట్లో టాటా టిగోర్ iCNG AMT 5 కలర్స్‌ మరియు 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ సెడాన్‌ను చాలా తక్కువ సమయం మేము టెస్ట్‌ డ్రైవ్‌ చేయడంతో దీని పూర్తి మైలేజ్‌ను మా టీమ్‌ తనిఖీ చేయలేకపోయింది. అయితే పూర్తి ట్యాంక్ CNG మరియు పెట్రోల్‌తో కలిపి 700 కి.మీలకు మైలేజ్‌ ఇస్తుందని తెలుస్తోంది.

Tata-Tigor-iCNG-AMT-Design-Engine-Performance-Full-Review

చివరగా టాటా టిగోర్‌ iCNG AMT 4-స్టార్ట్ సేఫ్టీ రేటింగ్‌తో భద్రతా పరంగా భేష్‌ అనిపించుకుంది. రూ. 10 లక్షల ధరలో మంచి ఫ్యామిలీ కారు కొనాలనుకునేవారికి ABS, EBD, ఎయిర్‌బ్యాగ్‌లు మరియు మరెన్నో ఫీచర్లతో కూడిన ఈ సెడాన్‌ మంచి ఆప్షన్‌. ప్రస్తుతం మార్కెట్లో.. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుండటంతో.. కొత్త కారు కొనాలనుకునేవారు Tigor iCNG AMT ను పరిశీలించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 21, 2024, 16:00 [IST]
English summary
Tata tigor icng amt design features specs engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+