టాటా జికా కారు క్విడ్ మరియు ఆల్టోలను అంతం చేయగలదా? మూడు కార్ల స్పష్టమైన పోలికలు...
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గల ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్‌ల మధ్య పోటి తీవ్రమైంది. నాలుగు లక్షల లోపు ధర గల కార్ల మధ్యన పెను యుద్దం జరగబోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యంత ఆదరణ గల కార్లలో మారుతి సుజుకి ఆల్టో కారు ఒకటి కాని ఈ మద్యనే విడుదలైన రెనొ క్విడ్ ఆల్టో కు గట్టి పోటిగా నిలబడింది.
Also Read: మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం
టాటా మోటార్స్ వారు త్వరలో విడుదల చేయనున్న తన జికా కారు ఈ రెండు కార్లకు గట్టి పోటిగా ఉండనుంది అంటే ఇప్పుడు ఎంట్రీ లెవల్ హ్యాచ్‍బ్యాక్‌లలో ఈ మూడు కార్ల ప్రచండ యుద్దానికి సై అంటున్నాయి.అయితే ఈ మూడు కార్లలో ఏది ఉత్తమం చివరికి ఏ కారు అత్యధిక ఆదరణ పొందుతుందో అని తెలపడానికి డ్రైవ్‌స్పార్క్ వీటి మద్య గల తేడాలను పోల్చింది. మరి మీరు దేనిని ఎంచుకుంటారు? క్రింద గల కథనాలను చదివి తరువాత నిర్ణయం తీసుకోండి.

ధర
- మారుతి సుజుకి ఆల్టో ధర రూ. 2.66 లక్షలు
- రెనొ క్విడ్ ధర రూ. 2.81 లక్షలు
- టాటా జికా ఊహించిన ధర రూ. 3.75 లక్షలు ( ఇంకా విడుదల కాలేదు)
- ఇంజన్ కెపాసిటి: 1199సీసీ మరియు 1047 సీసీ
- ఫ్యూయల్ రకం: పెట్రోల్ మరియు డీజల్
- పవర్: 84 బిహెచ్‌పి మరియు 69 బిహెచ్‌పి
- ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
- ఇంజన్ కెపాసిటి: 799సీసీ
- ఇంధన రకం: పెట్రోల్
- పవర్: 53 బిహెచ్‌పి
- ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు
- ఇంజన్ కెపాసిటి: 796సీసీ
- ఇంధన రకం: పెట్రోల్
- పవర్: 47బిహెచ్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.
- ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
- ఫోన్ ఛార్జర్
- పవర్ విండోలు
- న్యావిగేషన్ సిస్టమ్
- ఇంకా బోల్ట్ కారులో గల ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- రెనొ క్విడ్‌లో గల ఫీచర్లు
- 2-డిఐయన్ టచ్‌స్క్రీన్
- ఇన్పోటైన్‌మెంట్
- బ్లూటూత్ కనెక్టివిటి
- న్యావిగేషన్ వంటి ఎన్నో అశ్చర్యకరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లు అన్ని కూడా క్విడ్ యొక్క టాప్ లెవల్ వేరియంట్‌లోని మాత్రమే.
- ఆడియో సిస్టమ్
- యుయస్‌బి కనెక్టివిటి
- ఎయుయక్స్ కనెక్టివిటి
- ఫ్యాబ్రిక్ సీట్లు
- పవర్ స్టీరింగ్
- మరియు టాప్ లెవల్ వేరియంట్‌లో ఎ/సి కూడా కలదు.
- రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో 800
- నువ్వా నేనా అంటున్న రాయల్ ఎన్ఫీల్ట్ మరియు బజాజ్ అవెంజర్
- రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు
అన్ని ధరలు ఆన్-రోడ్ (ఢిల్లీ).

టాటా జికా డిజైన్
టాటా జికా కారు డిజైన్ ఏ ఇతర టాటా కార్లలో కూడా లేదు. అంటే ఇది పూర్తిగా కొత్త డిజైన్. కారు ముందు భాగం అందమైన ముక్కు ఆకారంలో దీనిని రూపొందించారు. ఇక దీని హెడ్ లైట్స్ యొక్క డిజైన్ దీని ఫ్రంట్ డిజైన్‌కు సరిపోయె విధంగా రూపొందించారు. ఫ్రంట్ సైడ్ గల కొత్త గ్రిల్ దీనికి మరింత ఆకర్షణగా నిలిచింది. డోర్లకు బయటి వైపున ఆకర్షణీయ రూపాన్ని అందించారు. మొత్తం మీద చెప్పాలంటే దీని డిజైన్ అత్బుతం.

రెనొ క్విడ్
రెనొ క్విడ్ డిజైన్ మొత్తం రెనొలో గల డస్టర్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ముందు వైపున గల కొత్త గ్రిల్ మరియు ఫ్రంట్ హెడ్‌లైట్స్ ఇందులో ఉత్తమంగా ఉన్నాయి. మరియు ఇందులో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. ఈ ఫీచర్లు ఇది అల్టోని ఓడింటడానికి కారణమయ్యాయి.

మారుతి ఆల్టో డిజైన్.
మారుతి సుజుకి తన ఆల్టోను ప్రవేశ పెట్టినప్పటి నుండి ఒకే విధమైన డిజైన్ పద్దతులను అనుసరిస్తోంది. ఆల్టో ముందు భాగం అలల వంటి డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ముందు భాగాన పెటల్ షేప్ గల హెడ్ లైట్లు కలవు. ఇక దీని టాపును కొంచెం ముందుకు మరియు కొంచెం వెనుకకు వాలు ఉండే విధంగా రూపొందించారు.

జికా ఇంజన్

రెనొ క్విడ్ ఇంజన్ వివరాలు

మారుతి ఆల్టో ఇంజన్ వివరాలు

టాటా జికా ఫీచర్లు
ఇందులో విశాలమైన స్థలం ఇందులో మనకు కావాల్సిన బాటిల్స్ ఇతర వస్తువులను చక్కగా పెట్టుకోవచ్చు. ఇందులో గల ఫీచర్లు:

రెనొ క్విడ్ ఫీచర్లు

మారుతి సుజుకి ఆల్టో ఫీచర్లు

మారుతి సుజుకి ఆల్టో మైలేజ్:
భారతీయ మార్కెట్లోని కార్లకు ఉండవలసిన ముఖ్యమై లక్షణం ఉత్తమ మైలేజ్. మారుతి సుజుకి ఆల్టోలో గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 21 కిలో మీటర్ల వరకు మైలేజ్‌ని ఇస్తుంది.

రెనొ క్విడ్ మైలేజ్
ఎంట్రీ లెవల్ కార్లలో అతి ఉత్తమమైన మైలేజ్ ఇవ్వగల కారు రెనొ క్విడ్. క్విడ్‌లో పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 25 కిలో మీటర్లు మైలేజ్‌ని ఇస్తుంది.

టాటా జికా మైలేజ్
టాటా జికాలో గల పెట్రోల్ వేరియంట్ కారు లీటర్‌కు 20 కిలో మీటర్ల వరకు మరియు డీజల్ వేరియంట్ కారు దాదాపుగా లీటర్‌కు 25 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలవు. అంటే టాటా వారి జికా కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్విడ్ మరియు ఆల్టోలతో మైలేజ్ పరంగా గట్టి పోటిని ఎదుర్కోబోతోంది.

భద్రత
ఈ ఆధునిక ప్రపంచంలో భద్రనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. వాహనాల వినయోగం పెరిగే కొద్ది ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. అందుకోసం ఇప్పుడు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లోల ఎక్కువగా భద్రత పరమైన ఫీచర్లు అందిస్తున్నారు. ఆల్టో, క్విడ్ మరియు జికా అన్ని కార్లలో ఎయిర్ బ్యాగులను ఆప్షనల్‍గా తమ టాప్ ఎండ్ వేరియంట్లలో అందించారు.

తీర్పు
ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఇంతకు ముందు క్విడ్ ఆల్టోతో పోటి పడి క్విడ్ నెగ్గింది. అతి ఉత్తమమైన కారుగా క్విడ్ నిలిచింది. కాని ఇప్పుడు క్విడ్ కారు జికా కారుతో పోటి పడిుతోంది.
మీరు వెచ్చించే డబ్బుకు సరైన విలువ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన క్విడ్ కారు. కాని ఈ క్విడ్ మరియు జికా కారుతో పోలిస్తే, జికా కారు ఉత్తమం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అత్యంత శక్తివంతమైన ఇంజన కలదు మరియు ఇది రెండు ఇంజన్ అప్షన్‌లలో లభించనుంది.

డ్రైవ్ స్పార్క్ ఆలోచన
టాటా మోటర్స్ ఇప్పటికే విడుదల చేసిన జెస్ట్ మరియు బోల్ట్ కార్లు పెద్దగా ఆదరణ పొందక పోయినప్పటికి ఈ జికా కారు మంచి ఆదరణ పొందగలదు. మరియు టాటా మోటార్స్ కోల్పోయిన నమ్మకాన్ని ఇది నింపగలదని మేము భావిస్తున్నాము.



Click it and Unblock the Notifications








