భారత్‌లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 10 పెట్రోల్ కార్స్

By Ravi

డీజిల్ కార్లను నడపటం కన్నా పెట్రోల్ కార్లను నడపటంలో ఎంతో ఫన్ ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, పెట్రోల్ ఒక క్లీన్ బర్నింగ్ ఫ్యూయెల్ కాబట్టి, ఈ కార్లు మంచి పికప్‌ను, క్విక్ యాక్సిలరేషన్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, పెట్రోల్ కార్లలో ఉపయోగించే ఇంజన్లను తక్కువ శబ్ధాన్ని చేస్తాయి, క్యాబిన్ లోపల కూడా డీజిల్ కార్ల కన్నా తక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం మన భారతదేశంలో డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్లే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. పెట్రోల్ కార్లను నడపటంలో ఫన్ ఉన్నప్పటికీ, కొందరు కస్టమర్లు మాత్రం ఈ కార్ల మైలేజ్ గురించి ఎక్కువగా చింతిస్తుంటారు. సాధారణంగా పెట్రోల్ కార్లు డీజిల్ కార్ల కన్నా తక్కువ మైలేజీనిస్తాయి. పెట్రోల్ ఇంధన ధర కూడా డీజిల్ ఇంధన ధర కన్నా ఎక్కువగా ఉంటుంది.

సగటున రోజుకు 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, నెలకు 1000 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేసే వారికి డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్లే బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. వాస్తవానికి పెట్రోల్ కార్ మోడల్ ధర వాటి డీజిల్ కార్ మోడల్ ధరతో పోల్చుకుంటే సుమారు లక్ష రూపాయాల వరకు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, పెట్రోల్ కార్ల మెయింటినెన్స్ కూడా డీజిల్ కార్ల తక్కువగా ఉంటుంది.

ఈనాటి మన కథనంలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే పెట్రోల్ కార్ల గురించి తెలుసుకుందాం రండి..!

టాప్ 10 పెట్రోల్ కార్స్ (మైలేజ్)

తర్వాతి స్లైడ్‌లలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే పెట్రోల్ కార్ల వివరాలను తెలుసుకోండి.

(గమనిక: ఇందులో పేర్కొన్న మైలేజ్ గణాంకాలు నిర్ధిష్ట డ్రైవింగ్ పరిస్థితులకు లోబడి ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం పరిగణలోకి తీసుకోబడ్డాయి. రియల్ వరల్డ్ మైలేజ్ గణంగాలు వీటి కన్నా కాస్తం తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. పాఠకులు గమనించగలరు.)

10. మారుతి స్విఫ్ట్ - 18.60 కెఎమ్‌పిఎల్

10. మారుతి స్విఫ్ట్ - 18.60 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 10 స్థానంలో ఉన్నది మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ కారు. ఇందులో 1197సీసీ, 4-సిలిండర్, కె-సిరీస్, వివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లు, మైలేజ్ - 18.60 కెఎమ్‌పిఎల్.

9. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0లీ - 18.90 కెఎమ్‌పిఎల్

9. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0లీ - 18.90 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 9 స్థానంలో ఉన్నది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0లీ ఈకోబూస్ట్ పెట్రోల్ కారు. ఇందులో 999సీసీ, ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 123 బిహెచ్‌పిల శక్తిని, 1400-4500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 52 లీటర్లు, మైలేజ్ - 18.90 కెఎమ్‌పిఎల్.

8. నిస్సాన్ మైక్రా యాక్టివ్ - 19.49 కెఎమ్‌పిఎల్

8. నిస్సాన్ మైక్రా యాక్టివ్ - 19.49 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 8 స్థానంలో ఉన్నది నిస్సాన్ మైక్రా యాక్టివ్ పెట్రోల్ కారు. ఇందులో 1198సీసీ, 3-సిలిండర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 41 లీటర్లు, మైలేజ్ - 19.49 కెఎమ్‌పిఎల్.

7. హ్యుందాయ్ ఐ10 - 19.80 కెఎమ్‌పిఎల్

7. హ్యుందాయ్ ఐ10 - 19.80 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 7 స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఐ10 పెట్రోల్ కారు. ఇందులో 1086సీసీ, 4-సిలిండర్, 1.1లీటర్ ఐఆర్‌డిఈ2 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 99 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 19.80 కెఎమ్‌పిఎల్.

6. మారుతి ఆల్టో కె10 - 20.20 కెఎమ్‌పిఎల్

6. మారుతి ఆల్టో కె10 - 20.20 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 6 స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ కారు. ఇందులో 998సీసీ, 3-సిలిండర్, ఆల్ అల్యూమినియం లైట్ వెయిట్ కె10బి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 20.92 కెఎమ్‌పిఎల్.

5. మారుతి వ్యాగన్ఆర్ - 20.51 కెఎమ్‌పిఎల్

5. మారుతి వ్యాగన్ఆర్ - 20.51 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 5 స్థానంలో ఉన్నది మారుతి వ్యాగన్ఆర్ పెట్రోల్ కారు. ఇందులో 998సీసీ, 3-సిలిండర్, ఆల్ అల్యూమినియం లైట్ వెయిట్ కె10బి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 20.51 కెఎమ్‌పిఎల్.

4. డాట్సన్ గో - 20.63 కెఎమ్‌పిఎల్

4. డాట్సన్ గో - 20.63 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 4 స్థానంలో ఉన్నది డాట్సన్ గో పెట్రోల్ కారు. ఇందులో 1198సీసీ, 3-సిలిండర్, డిఓహెచ్‌సి, డ్యూయెల్ విటివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 20.63 కెఎమ్‌పిఎల్.

3. హ్యుందాయ్ ఇయాన్ - 21.1 కెఎమ్‌పిఎల్

3. హ్యుందాయ్ ఇయాన్ - 21.1 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 3 స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఇయాన్ పెట్రోల్ కారు. ఇందులో 814సీసీ, 3-సిలిండర్, 9-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 55 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 75 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 32 లీటర్లు, మైలేజ్ - 21.1 కెఎమ్‌పిఎల్.

2. మారుతి ఆల్టో 800 - 22.74 కెఎమ్‌పిఎల్

2. మారుతి ఆల్టో 800 - 22.74 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 2 స్థానంలో ఉన్నది మారుతి ఆల్టో 800 పెట్రోల్ కారు. ఇందులో 796సీసీ, 3-సిలిండర్, ఎఫ్8డి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 48 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 22.74 కెఎమ్‌పిఎల్.

1. టాటా నానో - 25.4 కెఎమ్‌పిఎల్

1. టాటా నానో - 25.4 కెఎమ్‌పిఎల్

ఇక ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నది టాటా నానో పెట్రోల్ కారు. ఇందులో 624సీసీ, 2-సిలిండర్, ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 38 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు, మైలేజ్ - 25.4 కెఎమ్‌పిఎల్.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2014, 14:10 [IST]
English summary
We'll discuss about the top-10 most fuel efficient peteol cars in India. The basis on which we have short-listed these cars, is the ARAI mileage figures that these cars achieved during their test.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+