రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల రేంజ్‌లో మంచి డీజిల్ కార్లు

పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉంటాయి, అలాగే వీటి మెయింటినెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్ట, ప్రతినెలా సగటున 1500 కి.మీ. నుంచి 2000 కి.మీ. దూరం ప్రయాణించే వారికి మాత్రమే డీజిల్ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల డీజిల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు డీజిల్ కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. అయితే, పెరిగిన పోటీతత్వ వాతావరణంలో కార్ల తయారీదారులు సరసమైన ధరలకే డీజిల్ కార్లను విడుదల చేస్తున్నారు.

మరి వాటిలో మీ బడ్జెక్‌కు సరిపోయే డీజిల్ కారు ఏది? ఇలాంటి ప్రశ్నకు ఈ కథనంలో సమాధానం వెతుక్కుందాం రండి. ఈ కథనంలో మనం భారత మార్కెట్లో లభిస్తున్న డీజిల్ కార్లలో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల రేంజ్‌లో ధరలు కలిగిన బెస్ట్ డీజిల్ కార్ల గురించి, వాటి ధరలు, మైలేజ్ తదితర అంశాల గురించి తెలుసుకుందాం రండి..!

అత్యంత చవకైన డీజిల్ కార్లు..

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న కార్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీకి చెందినవి, అలాగే మైలేజ్ గణాంకాలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసినవి.

టాటా ఇండికా వి2

టాటా ఇండికా వి2

చీప్ డీజిల్ కారు అంటే టక్కున గుర్తుకు వచ్చేది టాటా ఇండికానే. సరసమైన ధర, మెరుగైన మైలేజ్, అతి తక్కువ నిర్వహణ వ్యయం ఈ కారు ప్రత్యేకత. అందుకే ఎక్కడ చూసిన ఈ కార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టాక్సీ వినియోగదారులు కూడా ఈ మోడల్‌నే ఎక్కువగా ఎంచుకుంటుంటారు. ఫ్యామిలి కారు కావాలనుకునే వారికి ఇందులో ఇండికా వి2 వేరియంట్ అందుబాటులో ఉంది.

మంచి: లో మెయింటినెన్స్, తక్కువ ధర, విశాలమైనది

చెడు: లుక్ అండ్ డిజైన్, నాణ్యత

టాటా ఇండికా వి2

టాటా ఇండికా వి2

  • టాటా ఇండికా వి2 కేవలం రెండు డీజిల్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.
  • దీని ప్రారంభ ధర రూ.4.19 లక్షలు.
  • మైలేజ్ 18 కెఎమ్‌పిఎల్
  • టాటా ఇండికా ఈవి2

    టాటా ఇండికా ఈవి2

    టాటా డీజిల్ కార్లలో ఎక్కువ మైలేజీనిచ్చే కారును కోరుకునేవారు ఇండికా ఈవి2ను ఎంచుకోవచ్చు. డిజైన్ పరంగా ఇది ఇండికా వి2 మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇందులో బిఎస్4 ఇంజన్ మెరుగైన మైలేజీని, మరింత శక్తిని ఆఫర్ చేస్తుంది. వాస్తవానికి, భారత్‌లో లభ్యమవుతున్న బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లలో ఇది కూడా ఒకటి.

    మంచి: బెటర్ మైలేజ్, లో మెయింటినెన్స్, ఇంటీరియర్ స్పేస్

    చెడు: లుక్ అండ్ డిజైన్, క్వాలిటీ

    టాటా ఇండికా ఈవి2

    టాటా ఇండికా ఈవి2

    • టాటా ఇండికా ఈవి2 రెండు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.
    • దీని ప్రారంభ ధర రూ.4.46 లక్షలుగా ఉంది.

    • మైలేజ్ 25 కెఎమ్‌పిఎల్
    • టాటా ఇండికా విస్టా

      టాటా ఇండికా విస్టా

      మైలేజ్, ధరను కొద్దిగా పక్కన పెట్టి, మెరుగైన ఫీచర్లతో కూడిన టాటా కారు కావాలనుకునే వారికి ఇండికా విస్టా మరో ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇదొక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇదివరకు చెప్పుకున్న ఇండికా కార్లతో పోల్చుకుంటే, విస్టా విభిన్నంగా ఉంటుంది. ఇందులోని ఇంజన్ 71 పిఎస్‌ల శక్తిని ఆఫర్ చేస్తుంది. ఈ పవర్ చాలదునుకునే వాళ్లు మరింత శక్తివంతమైన, స్పోర్టీయర్ విస్టా డి90 కారును ఎంచుకోవచ్చు (ధర రూ.6 లక్షలకు పైనే, అయితే ఇందులో ఏబిఎస్, ఈబిడి, ఎయిర్‍‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి).

      మంచి: పెర్ఫామెన్స్ అండ్ ఫీచర్స్ (డి90 విషయంలో), స్పేస్

      చెడు: నాణ్యత లేని ఫిట్ అండ్ ఫినిషింగ్, ట్రాన్సిమిషన్

      టాటా ఇండికా విస్టా

      టాటా ఇండికా విస్టా

      • టాటా ఇండికా విస్టా డీజిల్ మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది.
      • దీని ప్రారంభ ధర రూ.4.61 లక్షలుగా ఉంది.
      • మైలేజ్ 19.1 కెఎమ్‌పిఎల్
      • చెవర్లే బీట్

        చెవర్లే బీట్

        చెవర్లే బీట్ డీజిల్ వెర్షన్‌లో 936సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. మనదేశంలో లభిస్తున్న అతిచిన్న డీజిల్ ఇంజన్ కలిగిన కారు కూడా ఇదే. దీని కాంపాక్ట్ ఇంజన్ కారణంగా ఇది అత్యుత్తమ మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఇంజన్ చిన్నదైనప్పటికీ, పవర్‌లో మాత్రం ఎక్కడా రాజీపడకుండా, దాదాపు అన్ని సిటీ కార్ల మాదిరిగనే పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. సిటీ డ్రైవ్‌కి ఈ కారు చక్కగా సూట్ అవుతుంది.

        మంచి: డిజైన్, రద్దీగా ఉండే సిటీ రోడ్లపై డ్రైవింగ్‌కు అనుకూలం, మంచి ఎక్విప్‌మెంట్స్, ఫీచర్స్

        చెడు: తక్కువ ఇంటీరియర్ స్పేస్, చిన్న రియర్ విండో, చిన్న ఇంజన్

        చెవర్లే బీట్

        చెవర్లే బీట్

        • చెవర్లే బీట్ డీజిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
        • దీని ప్రారంభ ధర రూ.4.74 లక్షలుగా ఉంది.
        • మైలేజ్ 18.61 కెఎమ్‌పిఎల్.
        • ఫోర్డ్ ఫిగో

          ఫోర్డ్ ఫిగో

          ఫోర్డ్ ఫిగో ఇంటీరియర్ స్పేస్ చాలా బాగుంటుంది. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఈ కారు ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. అయితే, ఇది స్పోర్టీయర్ హ్యాచ్‌బ్యాక్ కాకపోయినప్పటికీ పెర్ఫామెన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది (ప్రత్యేకించి హైవేలపై).

          మంచి: స్పేస్, స్టీరింగ్, మంచి ఎయిర్ కండిషనింగ్

          చెడు: బంపీ రోడ్లపై సస్పెన్షన్ అంత సౌకర్యంగా అనిపించదు

          ఫోర్డ్ ఫిగో

          ఫోర్డ్ ఫిగో

          • ఫోర్డ్ ఫిగో డీజిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
          • దీని ప్రారంభ ధర రూ.4.88 లక్షలుగా ఉంది.
          • మైలేజ్ 20 కెఎమ్‌పిఎల్
          • మారుతి సుజుకి రిట్జ్

            మారుతి సుజుకి రిట్జ్

            మారుతి సుజుకి రిట్జ్ స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. హృదయం ఒక్కటే శరీరం వేరు అన్నట్లుగా.. ఈ రెండు కార్లలో ఉపయోగించే ఇంజన్లను ఒక్కటే, కానీ బాడీ మాత్రమే వేరు. రిట్జ్ కారు వెనుక డిజైన్ చాలా మందికి నచ్చదు. కానీ డీజిల్ వెర్షన్ రిట్జ్ ఇచ్చే మైలేజ్ మాత్రం ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ ఇంజన్ కూడా స్మూత్‌గా ఉంటుంది.

            మంచి: ఎత్తుగా ఉండే డిజైన్, ఇంజన్, ప్రాక్టికల్

            చెడు: రియర్ డిజైన్, ఇంటీరియర్ క్వాలిటీని మెరుగు పరస్తే బాగుంటుంది

            మారుతి సుజుకి రిట్జ్

            మారుతి సుజుకి రిట్జ్

            • మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
            • దీని ప్రారంభ ధర రూ.5.42 లక్షలుగా ఉంది.
            • మైలేజ్ 23.2 కెఎమ్‌పిఎల్
            • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

              హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

              ఎంట్రీ లెవల్ డీజిల్ కార్ సెగ్మెంట్లో తాజాగా వచ్చిన మోడల్ ఇది. నెక్స్ట్ జనరేషన్ ఐ10 కారుగా వచ్చిన ఈ మోడల్‌లో హై-ఎండ్ కార్లలో లభించే ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. కాంపాక్ట్ షేప్, స్టయిలిష్ డిజైన్ కలిగిన గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది మంచి ఇంటీరియర్ స్పేస్‌ను కూడా ఆఫర్ చేస్తుంది.

              మంచి: మంచి ఫిట్ అండ్ ఫినిష్, ఇంజన్, ఫీచర్స్, స్పేస్

              చెడు: వాస్తవానికి ఏమీ లేవనే చెప్పాలి

              హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

              హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

              • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డీజిల్ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది.
              • దీని ప్రారంభ ధర రూ.5.25 లక్షలుగా ఉంది.
              • మైలేజ్ 24 కెఎమ్‌పిల్
              • నిస్సాన్ మైక్రా

                నిస్సాన్ మైక్రా

                నిస్సాన్ అందిస్తున్న మైక్రా హ్యాచ్‌బ్యాక్ పెప్పీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇటీవల విడుదలైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మునుపటి వెర్షన్ కన్నా మరింత స్టయిలిష్‌గా ఉంది. నిస్సాన్ మైక్రా డీజిల్ ఇంజన్ సిటీ డ్రైవ్‌కు బాగానే ఉంటుంది, కానీ హైవే పెర్ఫామెన్స్ ఆశించినంతగా ఉండదు. అయితే, ఈ ఇంజన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని లైట్ స్టీరింగ్ వలన సిటీ రోడ్లపై స్టీర్ చేయటం చాలా సలువుగా ఉంటుంది.

                మంచి: అత్యుత్తమ ఫీచర్స్ - ఇంజన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, అన్ని వేరియంట్లలో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, స్టయిలింగ్, క్వాలిటీ, లైట్ స్టీరింగ్

                చెడు: కారు గురించి చెడుగా ఏమీ లేవు కానీ, నిస్సాన్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మెరుగు పరస్తే బాగుంటుంది.

                నిస్సాన్ మైక్రా

                నిస్సాన్ మైక్రా

                • నిస్సాన్ మైక్రా డీజిల్ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది.
                • దీని ప్రారంభ ధర రూ.5.57 లక్షలుగా ఉంది.
                • మైలేజ్ 23 కెఎమ్‌పిఎల్
                • మారుతి సుజుకి స్విఫ్ట్

                  మారుతి సుజుకి స్విఫ్ట్

                  చివరిగా.. మారుతి సుజుకి స్విఫ్ట్ ఇండియాలోనే కాకుండా యూరోపియన్, ఆసియా మార్కెట్లలో కూడా అత్యంత పాపులర్ మోడల్. ఇది స్పోర్టీగా కనిపించే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. హైపెర్ఫామెన్స్ ఇంజన్, మెరుగైన మైలేజ్‌లు ఈ కారు ప్రత్యేకత. అయితే, దీని ధర ఇతర మోడళ్లతో పోల్చుకుంటే (ప్రత్యేకించి గ్రాండ్ ఐ10) ఎక్కువగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, స్విఫ్ట్ ధరకు తగిన విలువనిస్తుంది.

                  మంచి: ఇంజన్, మైలేజ్, పెర్ఫామెన్స్, హ్యాండ్లింగ్

                  చెడు: ధర, బూట్ స్పేస్, బ్రేక్స్, కొందరికి డిజైన్ బోరింగ్‌గా అనిపించడం.

                  మారుతి సుజుకి స్విఫ్ట్

                  మారుతి సుజుకి స్విఫ్ట్

                  • మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది.
                  • దీని ప్రారంభ ధర రూ.5.58 లక్షలుగా ఉంది.
                  • మైలేజ్ 22.9 కెఎమ్‌పిఎల్
                  • ఏది బెస్ట్..?

                    ఏది బెస్ట్..?

                    ఈ డీజిల్ కార్లలో విన్నర్‌గా ప్రత్యేకించి ఏ మోడల్‌ను చెప్పలేము. ఏ కారు ప్రత్యేకత దానిదే. అయితే, మీ ఎంపికను బట్టి ఇది ఉంటుంది. ఉదాహరణకు మీరు ధర, మైలేజ్ పరిగణలోకి తీసుకుంటే తక్కువ ధర కలిగిన డీజిల్ కార్లను ఎంచుకోవచ్చు. అలాగే, మీరు ఫీచర్లు, డిజైన్‌లను పరిగణలోకి తీసుకుంటే, ప్రీమియం కార్లను ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2013, 12:24 [IST]
English summary
The price range between Rs 4 lakhs and Rs 6 lakhs is the most competitive among diesel hatchbacks in India. The following gallery provides a list of diesel hatchbacks in India priced between Rs 4 lakhs and Rs 6 lakhs, along data such as mileage, price, features and other details, which should help you decide which diesel hatchback to opt for.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+