రూ.10 లక్షలకు దిగువన లభించే బెస్ట్ సెడాన్స్: ధర, ఫీచర్స్, మైలేజ్

హ్యాచ్‌బ్యాక్‌లు నచ్చని వారి, విశాలమైన మరియు సౌకర్యవంతమైన కారు కోరుకునే వారు, అలాగే తరచూ లాంగ్ ట్రిప్‌లు వెళ్లే వారు లేదా నిత్యం ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తుండే వారికి సెడాన్ బాడీ టైప్ కార్లు (వెనుక బూట్ ఉండేవి) బెస్ట్ ఆప్షన్లని చెప్పవచ్చు. ప్రస్తుతం మన భారత ఆటోమొబైల్ మార్కెట్లో అనేక కొత్త సెడాన్లు, అలాగే పాపులర్ సెడాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇటీవలి బడ్జెట్‌లో భారత ప్రభుత్వం కాంపాక్ట్ కార్లపై చేసిన సవరణల్లో భాగంగా, నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండే కార్లపై తక్కువ ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండటంతో కార్ల తయారీదారులు కూడా తమ సెడాన్లు 4 మీటర్ల కన్నా కొద్దిగా తక్కువగా ఉండేలా డిజైన్ చేసి, ఈ ఎక్సైజ్ ప్రయోజనాన్ని పొంది, సరసమైన ధరకే సౌకర్యమైన కార్లను ఆఫర్ చేస్తున్నారు.

మరి మన మార్కెట్లో రూ.10 లక్షల దిగువన లభించే ఉత్తమ సెడాన్ కార్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

రూ.10 లక్షలకు దిగువన లభించే బెస్ట్ సెడాన్స్

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అన్ని కార్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీకి చెందినవి మరియు మైలేజ్ గణాంకాలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసినవి. ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. నడిపే తీరు, రోడ్డు, వాహన కండిషన్‌ను బట్టి మైలేజ్ మారుతుంది.

చెవర్లే సెయిల్

చెవర్లే సెయిల్

మంచి: చెవర్లే యువా హ్యాచ్‌బ్యాక్‌కు సెడాన్ వెర్షనే ఈ సెయిల్. డీసెంట్ లుక్, స్పేసియస్ క్యాబిన్, ఇంప్రెసివ్ రైడ్ క్వాలిటీ, మంచి ఫీచర్స్ ఈ కారు ప్రత్యేకతలు.

చెడు: వెనుక సీట్లో ముగ్గురు ప్రయాణికులు కూర్చుకున్నప్పుడు అంత సౌకర్యంగా అనిపించకపోవటం, ఇంటీరియర్ ప్రీమియంగా అనిపించకపోవటం.

చెవర్లే సెయిల్

చెవర్లే సెయిల్

ప్రారంభ ధర: రూ.5.11 లక్షలు

మైలేజ్: 18.2 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 22 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

ఫోర్డ్ క్లాసిక్

ఫోర్డ్ క్లాసిక్

మంచి: మంచి హ్యాండ్లింగ్, ఫన్ టూ రైడ్, కంఫర్టబల్ రైడ్, స్పేసియస్ ఇంటీరియర్, ఎక్సలెంట్ పెర్ఫామెన్స్ వంటివి ఈ కారు ప్రత్యేకతలు.

చెడు: టాప్-ఎండ్ వేరియంట్ తప్ప మిగిలిన వేరియంట్లలో ఏబిఎస్, ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్లు లేకపోవటం.

ఫోర్డ్ క్లాసిక్

ఫోర్డ్ క్లాసిక్

ప్రారంభ ధర: రూ.5.64 లక్షలు

మైలేజ్: 13.9 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 20 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

హోండా అమేజ్

హోండా అమేజ్

మంచి: అత్యధిక మైలేజ్, కాంపాక్ట్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, కంఫర్టబల్ రియర్ సీట్స్ (డిజైర్‌తో పోల్చుకుంటే), ఎక్కువ బుట్ స్పేస్, స్మూత్ గేర్ షిఫ్టింగ్, లైట్ స్టీరింగ్, ఆటోమేటిక్ వేరియంట్ (పెట్రోల్ వెర్షన్‌లో) అందుబాటులో ఉండటం.

చెడు: ఇతర కార్లతో పోల్చినప్పుడు బేసిక్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ అంత మెరుగ్గా అనిపించకపోవటం, హ్యాండ్లింగ్ డీసెంట్‌గానే ఉంటుంది కానీ ఫోర్డ్ క్లాసిక్ లేదా సెయిల్ మాదిరిగా ఉండకపోవటం, స్పోర్టీగా ఉండకపోవటం, అధిక నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్ కలిగి ఉండటం (డిజైర్‌తో పోల్చుకుంటే).

హోండా అమేజ్

హోండా అమేజ్

ప్రారంభ ధర: రూ.5.05 లక్షలు

మైలేజ్: 18 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 25.8 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

మహీంద్రా వెరిటో వైబ్

మహీంద్రా వెరిటో వైబ్

మంచి: సాటిలేని రైడ్ క్వాలిటీ, స్పేసియస్ ఇంటీరియర్, కంఫర్టబల్ రియర్ సీట్, నాణ్యమైన తయారీ.

చెడు: వెనుక లుక్ సరిగ్గా ఉండకపోవటం, హెవీ స్టీరింగ్, తక్కువ హార్స్ పవర్, అంతంత మాత్రంగా ఉండే ఫీచర్స్.

మహీంద్రా వెరిటో వైబ్

మహీంద్రా వెరిటో వైబ్

ప్రారంభ ధర: రూ.5.68 లక్షలు

మైలేజ్: 20.8 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మంచి: రీఫైన్డ్ ఇంజన్, మంచి రైడ్ క్వాలిటీ, మెరుగైన మైలేజ్, ఈజీ హ్యాండ్లింగ్, మారుతి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, విస్తృతమైన నెట్‌‌వర్క్, ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో ఉండటం.

చెడు: చిన్నదిగా అనిపించే బూట్ డోర్ డిజైన్, వెరిటో, ఫోర్డ్ క్లాసిక్, ఎతియోస్, అమేజ్ మాదిరిగా స్పేసియస్‌గా ఉండకపోవటం (ప్రత్యేకించి బూట్ స్పేస్ విషయంలో), పూర్ బ్రేక్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ప్రారంభ ధర: రూ.4.92 లక్షలు

మైలేజ్: 19 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 23.4 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

టొయోటా ఎతియోస్

టొయోటా ఎతియోస్

మంచి: మంచి రైడ్ క్వాలిటీ, విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్, కంఫర్టబల్ సీటింగ్, మెరుగైన మైలేజ్, మంచి డీజిల్ ఇంజన్.

చెడు: హైవే ఇంజన్ పెర్ఫామెన్స్ సరిపోకపోవటం, డిజైన్, సిటీలో డ్రైవింగ్ కంఫర్ట్ లేకపోవటం.

టొయోటా ఎతియోస్

టొయోటా ఎతియోస్

ప్రారంభ ధర: రూ.5.49 లక్షలు

మైలేజ్: 16.78 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 23.59 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

మంచి: సరసమైన ధరకే హై-ఎండ్ వేరియంట్ అందుబాటులో ఉండటం, మంచి రైడ్ క్వాలిటీ, ధరకు తగిన ఫీచర్లు.

చెడు: సస్పెన్షన్, పూర్ ఫిట్ అండ్ ఫినిష్ (ప్రత్యేకించి క్యాబిన్‌లో), హ్యాండ్లింగ్ ఒకే కానీ బెస్ట్ కాదు.

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

ప్రారంభ ధర: రూ.4.99 లక్షలు

మైలేజ్: 14 కెఎమ్‌పిఎల్ (పెట్రోల్), 25 కెఎమ్‌పిఎల్ (డీజిల్)

చివరి మాట..

చివరి మాట..

ఈ సెడాన్లలో ఏ కారు ప్రత్యేకత దానికే ఉంటుంది. పిండి కొద్ది రొట్టె అన్న చందంగా, వెచ్చించే ధరను బట్టి ఫీచర్లు లభిస్తాయి. ఇందులో మీ అవసరాన్ని బట్టి ఒక్కో కారు సూట్ అవుతుంది. ఊదాహరణకు మీరు రైడ్ అండ్ హ్యాండ్లింగ్‌ను చూసుకున్నట్లయితే, ఫోర్డ్ క్లాసిక్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అలాగే, మైలేజ్ మరియు కంఫర్టబల్ సిటీ డ్రైవింగ్ తీసుకుంటే హోండా అమేజ్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. సరసమైన ధర చూసుకునే వారికి టాటా ఇండిగో ఈసిఎస్, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి సెయిల్ బెస్ట్ కార్లుగా నిలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2013, 17:30 [IST]
English summary
The tax hike introduced by the government for cars longer than 4 meters resulted in the creation of an entirely new segment in India. Sub-4 meter or compact sedans. These are entry level sedans available for less than INR 10 lakhs fully loaded and extremely attractive starting prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+