Volvo C40 Recharge Full Review వోల్వో C40 రీఛార్జ్‌ ఫీచర్లు, డిజైన్‌, ఇంజిన్‌ ఫర్మామెన్స్‌ పుల్‌ రివ్యూ

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ వాల్వో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీవైపు సాగుతోంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలనే విక్రయించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత నెలలో వాల్వో C40 రీఛార్జ్‌ను భారత్‌ మార్కెట్‌లో ఆవిష్కరించింది. వాల్వో C40 రీఛార్జ్‌ వాహనం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ వాహనం పనితీరును పరీక్షించేందుకు మా బృందానికి అవకాశం వచ్చింది. ఈ వాహనం పనితీరు, ఇతర ఫీచర్లపై మా సమీక్ష మీకోసం.

వాల్వో C40 రీఛార్జ్‌ రివ్యూ డిజైన్‌, కంఫర్ట్‌, టెక్‌ : వాల్వో C40 రీఛార్జ్‌ని ఎలక్ట్రిక్‌ వాల్వో XC40 ట్రెండీయర్, ఎడ్జియర్‌ వెర్షన్‌గా పరిగణించవచ్చు. మొత్తం డిజైన్‌ XC40 రీఛార్జ్‌ మాదిరిగానే ఉంటుంది. కూపే లాంటి రూఫ్‌, స్పోర్టీ టచ్‌లు C40 రీఛార్జికి మరింత ఆకర్షణ ఇవ్వనున్నాయి.

Volvo C40 Recharge full review in Telugu

ఈ వాహనం ముందు భాగంలో కొత్త C40 రీఛార్జ్‌.. వోల్వో యొక్క ఐకానిక్‌ థోర్స్‌ హామర్‌ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. ఈ ఐకానిక్‌ లైట్లు వోల్వో బ్యాడ్జ్‌ని ఆనుకొని క్లోజ్డ్‌ ఆఫ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌కు ఆనుకొని ఉన్నాయి. ఈ కారు ఫాగ్‌ ల్యాంప్‌లను కలిగి ఉండే స్పోర్టియర్ బంపర్‌లను కలిగి ఉంటుంది.

వోల్వో C40 రీఛార్జ్‌ పదునుగా ఉన్న రూఫ్‌లైన్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ వాహనం స్పోర్టీ లుక్‌ కోసం ఫ్లేర్డ్ అవుట్‌ వీల్‌ఆర్చ్‌, సైడ్‌ స్కర్ట్‌లను కూడా కలిగి ఉంది. వాల్వో C40 రీఛార్జ్‌ వెనుక విండ్‌ స్క్రీన్‌కు రెండు వైపులా రెండు మినీ స్పాయిలర్‌లు ఉంటాయి. దీంతోపాటు వెనుక గ్లాస్‌ మెటల్‌ భాగాన్ని కలిసే ప్రాంతంలో మరో స్పాయిలర్‌ను ఉంటుంది.

Volvo C40 Recharge full review in Telugu

వెనుక విండ్‌ స్క్రీన్‌ వైపులా వెళ్లేలా టెయిల్‌లైట్‌లు C- ఆకారంలో లైటింగ్ సిగ్నేచర్‌ను కలిగి ఉంటాయి. వెనుక బంపర్‌, ముందు బంపర్‌ దిగువ భాగాల్లో బ్లాక్‌ ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. వోల్వో C40 రీఛార్జ్‌ లోపలి భాగం చాలా సింపుల్‌గా ఉంటుంది. C40 రీఛార్జ్‌ క్యాబిన్‌ XC40 నుంచి చాలా మార్పులు ఉన్నాయి. SUVని చూసినట్లయితే చాలా వరకు సుపరిచితంగా ఉంటుంది.

వోల్వో C40 రీఛార్జ్ క్యాబిన్‌ లెదర్‌ ఫ్రీగా వస్తుంది. C40 రీఛార్జ్‌ రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించి కార్‌పెట్‌లను తయారుచేశారు. ఈ కారు డ్యాష్‌బోర్డు 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కాల్‌ప్లేను సపోర్టు చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రీమియం హార్మన్‌- కార్డాన్‌ ఆడియో సిస్టమ్‌తో జతచేయబడుతుంది.

Volvo C40 Recharge full review in Telugu

అన్ని రకాల రోడ్లపై సౌకర్యవంతంగా ఉండేలా ముందు సీట్లను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ముందు సీట్లు స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటాయి. వెనుక వైపు సీట్లు కూడా స్పోర్టీ లుక్‌తో వస్తాయి. వోల్వో C40 రీఛార్జ్‌ కారు నలుగురు వ్యక్తులు ప్రయాణించేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. బాగా ఎత్తుగా ఉన్న ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.

ఈ కారు 413 లీటర్‌ బూట్‌ స్పేస్‌తో వస్తుంది. తరచూ ట్రిప్‌లకు వెళ్లేవారు, వారంతంలో షాపింగ్ చేసేవారికి సరిగా సరిపోతుంది. ఈ కారు వెనుక విండో కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ డిజైన్‌ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే పార్కింగ్‌ సమయంలో సెన్సార్లు, కెమెరాల సాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేయవచ్చు.

Volvo C40 Recharge full review in Telugu

వోల్వో C40 రీఛార్జ్‌ కారు పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జర్‌, 360 డిగ్రీల కెమెరా, కనెక్టడ్‌ కార్‌ టెక్‌, ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌), మల్టీ ఎయిర్‌బ్యాగ్‌ సహా మరిన్ని భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మెరుగైన ఫీచర్లు ఈ కారు కలిగి ఉంది.

వోల్వో C40 రీఛార్జ్‌ రివ్యూ : బ్యాటరీ, రేంజ్‌ : వోల్వో C40 రీఛార్జ్ కారు 78kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌లో 530 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. బ్యాటీరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 11kW ఛార్జర్‌తో 6-7 గంటల సమయం పడుతుంది. అదే 150kW DC ఛార్జర్‌తో కేవలం 27 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జింగ్‌ అవుతుంది.

Volvo C40 Recharge full review in Telugu

ఈ భారీ బ్యాటరీ ప్యాక్‌ రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లను నడుపుతుంది. ఒక్కో యాక్సిల్‌పై ఒక్కో మోటార్‌ ఉంటుంది. ఫలితంగా 402bhp శక్తి, 660Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ కారు గరిష్ఠ వేగం 180kmphగా ఉంది.

వోల్వో C40 రీఛార్జ్‌ కంపాక్ట్‌ SUVగా పరిగణించబడుతుంది. ఈ కారు 4440 mm పొడవు, 1873 mm వెడల్పు, 1591 mm ఎత్తు, 2702 mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ కారు 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ SUV 171mm గ్రౌండ్‌ క్రియరెన్స్‌తో వస్తుంది.

Volvo C40 Recharge full review in Telugu

వోల్వో C40 రీఛార్జ్‌ డ్రైవింగ్‌ ఇంప్రెషన్స్‌: ఈ వోల్వో C40 రీఛార్జ్‌ SUVను సాధారణ ప్రక్రియ ద్వారా స్టార్ట్‌ చేయలేం. పుష్‌ బటన్‌ ఉండదు. డ్రైవింగ్‌ సీట్లో డ్రైవర్‌ కూర్చొని ఉంటే గేర్‌బాక్స్‌ డ్రైవర్‌ మోడ్‌లోకి మారుతుంది. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఎంపిక చేసేందుకు ఎటువంటి డ్రైవింగ్‌ మోడ్‌లు ఉండవు.

ఈ కారు కేవలం 4.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. అయితే ఈ కారులో చాలా వేగవంతమైన అనుభూతి కలుగుతుంది. ఈ కారు భారీ బ్యాటరీ, 2.1 టన్నుల బరువున్నా.. మెరుగైన సస్పెన్షన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. గుంతల రోడ్లు సహా ఇతర రహదారులపై సస్పెన్షన్‌ వ్యవస్థ కొంచెం కఠినంగా అనిపిస్తుంది.

Volvo C40 Recharge full review in Telugu

ఈ కారులో వేగంగా ప్రయాణం చేస్తున్నప్పుడు స్టీరింగ్ వీల్‌ బరువు పెరుగుతున్న అనుభూతి కలుగుతుంది. కారు వేగాన్ని తగ్గించిన ప్రతిసారి బ్యాటరీ ప్యాక్‌ను టాప్‌ అప్‌ చేయడంలో సహాయపడతాయి. ఈ వోల్వో C40 రీఛార్జ్‌ కారు నగరాల్లో చాలా అనువుగా ఉంటుంది.

కొన్ని పరిమితుల కారణంగా C40 కారు సరైన రేంజ్‌ను కనుగోనలేకపోయాము. అయితే ఈ కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో కచ్చితంగా 400 కి.మీ రేంజ్‌ కంటే ఎక్కువ ఇస్తుంది. వోల్వో C40 రీఛార్జ్‌ అనేది ఈవీ నుంచి ఆశించే ప్రతీది ఉంటుంది. గేర్‌, టెక్నాలజీ, క్యాబిన్‌ ఆకట్టుకుంటుంది. డిజైన్‌, ఇతర ఫీచర్లు కూడా ఆకర్షిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 26, 2023, 10:02 [IST]
English summary
Volvo c40 recharge features specs design driving impressions full review in telugu
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+