సంపన్నుల స్వర్గం ఆడి క్యు 7 కారు

సంపన్నుల కన్నుల్లో పడిన ఈ కారును ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు. స్పోర్టీగా, సౌకర్యవంతంగా ఉంది. దీని గ్రేస్ ఫుల డిజైన్ పలువురిని ఆకర్షిస్తోంది. కొత్త ఆడి క్యు 7 కారుకి స్టైల్, పనితీరు, భద్రత,సౌకర్యం, డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో మరే కారు సాటిరాదని ఆడి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బెనోయిట్ టియర్స్ చెప్పారు.
కారు ముందు వెనుక భాగాలు చూపరులను కట్టి పడేస్తాయి. దీని ధర 53,40,000.ఐబిస్ వైట్,టీక్ వుడ్, తదితర రంగుల్లో వస్తోంది.
ఆడి క్యు 7 పొడవు 5,089 మిల్లీ మీటర్లు, చక్రాల బేస్ 3002 మిల్లీ మీటర్లు. కస్టమర్ తనకు నచ్చిన విధంగా ఇంటీరియర్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఆరు లేదా ఏడు సీట్లు ఏర్పాటు చేయించుకోవచ్చు. కొత్త ఆడి క్యు 7 అత్యధిక సామర్ధ్యం కలిగిన డైరెక్ట్ -ఇంజెక్షన్ ఇంజిన్ల పవర్ పొందుతోంది. ఈ కారు ఆర్కా బ్లాక్,గ్రాఫైట్ గ్రే,డీప్ బ్లాక్, బాహియా బీజ్,కోబాల్ట్ బ్లూ,కాండర్ గ్రే,ఐస్ సిల్వర్,గార్నెట్ రెడ్, లావా గ్రే రంగుల్లో కూడా లభ్యమవుతోంది.


Click it and Unblock the Notifications








