సంపన్నులకు మాత్రమే వోక్స్ వ్యాగన్ బీటల్

యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఐదు వెరైటీలలో లభ్యమయ్యే ఈ కారు బేసిక్ మోడల్ ధరే 19 నుండీ 20 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. దీనికి తోడు ఈ బీటల్ కారు పూర్తిగా తయారయి మన దేశానికి దిగుమతి అవుతుండటంతో 110% కస్టమర్ డ్యూటీని భరించాల్సి వుంటుంది. దీంతో ఈ సంస్థ బేసిక్ కారు ధరే 20 లక్షలకు పైనే వుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ధరను దృష్టిలో వుంచుకుని ఈ కారును భారతదేశంలో పరిమిత సంఖ్యలో విడుదల చెయ్యాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








