నత్త నడకన సాగుతున్న 'నానో'

ప్రస్తుతానికి టాటా మోటార్స్ రోజుకు కేవలం 100 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, దీంతో అడ్వాన్స్ బుకింగులు చేసుకున్న వారికే కార్లను డెలివరీ చెయ్యలేక, లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన వారికి మాత్రమే కార్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. 2011లో మార్చి నాటికి కూడా అడ్వాన్స్ బుకింగుల ద్వారా కార్లను బుక్ చేసుకున్న వారందరికీ కార్లను సరఫరా చెయ్యడం కష్టమని, దీంతో అన్ని రోజులు వేచివుండలేని వారికి అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్నామని ఇరానీ స్పష్టం చేసాడు. ఈ వార్త నానో కోసం వేచిచూస్తున్న వారికి గొంతులో వెలగపండు పడినట్టే...!!


Click it and Unblock the Notifications