అమ్మకాలలో దూసుకుపోతున్న నిస్సాన్ మైక్రా..!

నిస్సాన్ మైక్రా ని ప్రవేశపెట్టిన వెంటనే కారుకి డిమాండ్ బాగా రావడమే కాకుండా 3600బుకింగ్స్ రావడం మాకు చాలా ఆశ్చర్యాన్నికలగజేసింది. దీనిని బట్టి నిస్సాన్ మైక్రా కస్టమర్స్ మనసుదోచుకున్న కారని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండ ఇప్పటివరకు 928కార్లను కస్టమర్స్ కి డెలివరి చేశామని మిగిలిన కస్టమర్లకు కూడా త్వరలోనే అందజేస్తామని అన్నారు. అంతేకాకుండా కస్టమర్స్ బుక్ చేసుకున్న వెంటనే వారికి నిస్సాన్ మైక్రా ని అందజేయడానికి ప్రయత్నస్తామన్నారు.
దానితో పాటు యూరప్ దేశాలకు కూడా కంపెనీ ఎగుమతిని ఫ్రారంభించాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు మొత్తం 3293యూనిట్ల నిస్సాన్ మైక్రా కార్లు అమ్మామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. వాటితో పాటు నిస్సాన్ టీనా(18యూనిట్లు)మరియు నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్(55 యూనిట్లు)అమ్మకాలు జరిగాయని వివరించారు.


Click it and Unblock the Notifications








