ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా విడుదల చేసిన జాజ్జ్ కారు బహుళజనాదరణ పొందుతోంది. గత ఏడాది ఉత్తమ కారు అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈ కారుకు మరిన్ని అధనపు ఆకర్షణలు జతచేసి సరికొత్త జాజ్జ్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఈ కారు ధరను రూ. 7.21 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. 1.2 లీటర్ i-vtec ఇంజన్ తో రూపొందిన జాజ్జ్ కారుకు, ఈ సరికొత్త జాజ్జ్ కారుకు ఇంజిన్ లో కానీ, సాంకేతికంగా ఎలాంటి మార్పులు చెయ్యలేదు.
కానీ కారు లుక్ ను ప్రభావితం చేసే విధంగా కారు అల్లాయ్ వీల్స్, కారు వెనుక వైపున సామాను ఉంచుకొనేందుకు వీలుగా షెల్ఫ్, కారు ముందు వైపున, వెనుక వైపున మడ్ గార్డులు లాంటి అధనపు హంగులతో ఈ సరికొత్త కారు రూపొందినది. ఇక ఈ సరికొత్త కారు వచ్చే వారం నుండీ హోండా షోరూమ్ లలో వినియేగదారునికి అందుబాటులోకి రానుంది.