ఇక మీదట టాటా నానో ఆన్ లైన్ లో...

అలాగే మొదట బుకింగ్ చేసుకున్న లక్ష మందికి కారుని ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని కార్లలో మంటలు రావడం వంటివి జరిగాయి. దానితో టాటా నానో జోలికి పోకూడదని కొంతమంది ప్రజలు నిర్ణయించుకున్నారు. కాని టాటా నానో స్దానాన్ని ఏ చిన్నకారు భర్తీ చేయలేక పోయింది. టాటా నానోకి పోటీగా చాలా కంపెనీలు చిన్న కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇటీనల టాటా నానో మళ్శీ కొత్తగా బుకింగ్స్ ని మొదలు పెట్టడంతో నానో అమ్మకాలు మళ్సీ జోరందుకున్నాయి. ఈ సారి టాటా నానో తోలిసారి ఆన్ లైన్ లో అమ్మడం జరిగింది.
ఈ తోలి కారుని అమెరికాలో పనిచేసే ఒక డాక్టర్ బుక్ చేయడం జరిగింది. వారణాసిలో ఉంటున్న తన కుటుంబం కోసం ఈబే మోటార్స్ వెబ్ సైట్ ద్వారా ఈ కారును బుక్ చేసిన ఆయన 2010 మోడల్ నానో ఎల్ఎక్స్ కారును 1,80,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ వెబ్ సైట్ ద్వారా అంతర్జాతీయంగా అమ్ముడైన తొలి నానో కారు ఇదేనని ఈబే మోటార్స్ ప్రతినిధులు తెలిపారు.


Click it and Unblock the Notifications








