దేశ రాజధానిలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. దేశ రాజధానిగా చెప్పుకునే మన మహానగరం ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకూ, తాగి డ్రైవ్/రైడ్ చేసినందుకుగానూ 13,000 మందికి పోలీసులు జరిమానా లేదా జైలుశిక్షను విధించారు. హస్తినాపుర (ఢీల్లీ) నగర చరిత్రలోనే ఇది అత్యధికం. ఢిల్లీ పోలీసు గణాంకాల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 20 వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 12,900 మందిని పట్టుబడ్డారు.
ఈ సంఖ్య ఇప్పటికే గతేడాది సంఖ్యను కూడా ఓవర్‌టేక్ చేసేసింది. 2010లో 11,388 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్కయ్యారు. వీరిలో దాదాపు 2,000 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయగా, 2,500 మందిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేసి అరెస్టు చేశారు. గడచిన పదేళ్లుగా ఢిల్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయిన వారి జాబితాను పరిశీలిస్తే...
సంవత్సరం - అరెస్టయిన వారి సంఖ్య:
2000 సంవత్సరం - 689 మంది
2001 సంవత్సరం - 1,545 మంది
2002 సంవత్సరం - 2,464 మంది
2003 సంవత్సరం - 2,793 మంది
2004 సంవత్సరం - 2,664 మంది
2005 సంవత్సరం - 3,551 మంది
2006 సంవత్సరం - 4,268 మంది
2007 సంవత్సరం - 4,192 మంది
2008 సంవత్సరం - 8,296 మంది
2009 సంవత్సరం - 12,784 మంది
2010 సంవత్సరం - 11,388 మంది


Click it and Unblock the Notifications








