కొత్త ప్లాంటు కోసం నియామకాలు: రాయల్ ఎన్‌ఫీల్డ్
ఐషర్ గ్రూపుకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమిళనాడులో రెండవ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మా తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో విభిన్న కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. సుమారు 350 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంటులో 2013 నాటికి సాలినా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి సాధించాలని కంపెనీ యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంటు కోసం ఉత్సాహవంతులైన యువకుల కోసం కంపెనీ వేట మొదలు పెట్టింది. సమవర్థవంతంగా పనిచేసే యువతేజాల కోసం తాము ఎదురుచూస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే దేశం నలుమూలల నుండి అభ్యర్థనలు వస్తున్నాయని, నైపుణ్యం కలిగిన వారిని ఎన్నుకోవడమే పెద్ద సవాల్ అని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. వెంకీ పద్మనాభన్ తెలిపారు.
ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 900 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, మరిన్ని కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించేందుకు కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల మోడల్‌ను బట్టి వాటి వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలల నుండి తొమ్మిది నెలల వరకూ ఉంటుంది. ఈ కొత్త ప్లాంటు గనుక నిర్వహణలోకి వచ్చినట్లయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది.


Click it and Unblock the Notifications








