పాత ధరకే, సరికొత్త హంగులతో విడుదలైన టాటా నానో..

అంతేకాదండోయ్.. 2012 టాటా నానో ఇంజన్ పాత నానో కారు కన్నా శక్తివంతంగా ఉండేలా తీర్చిదిద్దారు. 624 సీసీగా ఉన్న ఇంజన్ పవర్‌ను మరింతగా పెంచామని, గరిష్ట శక్తిని 35 పీఎస్ నుంచి38 పీఎస్‌కు, గరిష్ట టార్క్‌ను 48 ఎన్‌ఎమ్ నుంచి 51 ఎన్‌ఎమ్‌కు పెంచినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే, 2012 టాటా నానో మైలేజ్ కూడా పెరింగిది. గతంలో లీటరు పెట్రోల్‌కు 23.6 కిలోమీటర్ల మైలేజీనిచ్చే టాటా నానో ప్రస్తుతం 25.4 కిలోమీటర్లు ఇస్తుంది కంపెనీ వివరించింది.
ఇంకా, ఇది వరకూ ప్రతి కిలోమీటర్‌కు 101 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ (సీఓ2)ను విడుదల చేసే టాటా నానో ఇప్పుడు 92.7 గ్రాములకు తగ్గించారు. కొత్త నానో ఇన్ని మార్పులు చేర్పులు చేసిప్పటికీ నానో ధరను మాత్రం యధాతథంగా ఉంది. ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తున్న టాటా నానో కార్ల ధరలు రూ.1.40 లక్షల నుంచి 1.96 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. కొత్త టాటా నానో 10 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో ఎనిమి కొత్త రంగులు. మరి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నానో కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఊపందుకుంటాయా?


Click it and Unblock the Notifications








