ఏప్రిల్ నుండి 20% పెరగనున్న మోటార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం

మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు రెక్కలు రానున్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇది ఏకంగా 20 శాతం పెరగనుంది. ఈ మేరకు బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) యాక్సిడెంట్క్లెయిమ్స్‌ను సెటిల్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీల కామన్ పూల్, ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది.

"మార్చి 31, 2012 నుండి ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని నిర్ణయించడమైనద"ని ఐఆర్‌డీఏ ఓ ఆర్డర్‌ను జారీ చేసింది. ఐఆర్‌డీఏ తీసుకున్న ఈ నిర్ణయం వలన వాహన బీమా ప్రీమియం రేట్లు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఈ పూల్ వల్ల ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకే ప్రయోజనం కలుగుతోందని, తమకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమకు రూ.3,500 కోట్ల మేర నష్టాలు రావచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, December 24, 2011, 16:00 [IST]
English summary
Motor insurance premium is set to jump by up to 20 per cent from April 2012, with the IRDA deciding to scrap the common pool used by insurers to settle accident claims.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+