కార్ల దిగుమతి కుంభకోణంలో ఇద్దరు భారత దౌత్యవేత్తల హస్తం!

Car Import Scam
అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల.. 'కాదేదీ కవితకకు అనర్హం' అన్నారు మన మహాకవి శ్రీ. శ్రీ.. ఆయన కవిత్వాన్ని మన దేశంలోని కొందరు అవినీతిపరులు ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ.. వారు మాత్రం 'కాదేదీ కుంభకోణానికి అనర్హం' అనిపిస్తున్నారు. ఇప్పటికే భారతదేశం పలు కుభంకోణాలతో ఉక్కరిబిక్కిరి అవుతుంటే తాజాగా మరికొన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణాలు ప్రపంచపు రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఎదుగుతున్న మన దేశ ఆటో రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇటీవల భారత్‌లో కార్ల దిగమతి సంబంధించిన కుంభకోణం ఒకటి వెలుగు చూసింది.

విదేశాల నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో వియత్నాం మరియు ఉత్తరకొరియాలలో భారతదేశం తరఫున రాయబారులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు దౌత్యవేత్తల హస్తం ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. దిగుమతి సుంఖాన్ని చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చిన కార్లలో దాదాపు 40 కార్లను డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు సీజ్ చేశారు.

బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి హై-ఎండ్ లగ్జరీ కార్లపై ఒక్క రూపాయి కూడా దిగుమతి సుంఖాన్ని చెల్లించకుండా దౌత్యకార్యాలయంలో తమకున్న పరపతిని ఉపయోగించి అక్రమంగా వాటిని భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. సాధారణంగా ఒక వాహనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 110 శాతం దిగుమతి సుంఖాన్ని చెల్లించాలి. అంటే ఉదాహరణకు యూరప్‌లో ఒక లగ్జరీ కారు ధర భారత కరెన్సీ ప్రకారం ఒక కోటి రూపాయలు అనుకుంటే, దానిని భారత్‌కు దిగుమతి చేసుకుంటే రవాణాతో కలిపి అది రెండు కోట్ల రూపాయలను మించుతుంది.

దౌత్యకార్యలయ అధికారాన్ని వినియోగించుకొని వారిద్దరూ ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఆ దౌత్యవేత్తల వివరాలు మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఈ కుంభకోణానికి సంబంధించి తమకు వీరిద్దరు మాత్రమే తెలుసునని, తమ అంచనా ప్రకారం దీని వెనుక ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండొచ్చని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ ఉన్నతాధికారి ఆర్.కె. శర్మ తెలిపారు. ఆ దౌత్యవేత్తలను పోలీసుల ముందు హాజరపరిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విదేశంగా మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 31, 2011, 17:43 [IST]
English summary
Most of luxury cars sold in India was stolen from European countries. The Directorate of Revenue Intelligence (DRI) has started search operation for such cars in India. In this connection two diplomats from North Korea and Vietnam are being investigated and DRI has already seized nearly 40 such vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+