భారత్‌లో అత్యంత ఖరీదైన కారు ఆస్టన్ మార్టిన్ వన్-77

One-77
ఇంగ్లీష్ స్పోర్ట్స్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు ఇకపై భారత్‌లో లభ్యం కానున్నాయి. దేశీయ మార్కెట్లో సిగ్నెంట్ మినహా బేసిక్ మోడల్ వీ8 వ్యాంటేజ్ నుంచి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 వరకూ అన్ని మోడళ్లు లభిస్తాయని కంపెనీ వివరించింది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 10 బ్రాండ్‌లను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలు 1.35 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి.

కాగా.. ఆస్టన్ మార్టిన్ "వన్-77" అనే కారును కూడా దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొడల్ కార్లను కంపెనీ కేవలం 77 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అందుకే దీనికి వన్-77 అని పేరు పెట్టింది. భారత మార్కెట్లో దీని రూ. 20 కోట్లు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారు కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 50కు పైగా వన్-77 కార్లు అమ్ముడైనట్లు సమాచారం. 2 డోర్లు, 7.3 లీటర్ల ఇంజన్ సామర్థ్యముండే ఈ కారు బాడీని అల్యూమినియంతో రూపొందించారు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ కార్లను భారత్‌లో విక్రయించేందుకు పెర్ఫామెన్స్ కార్స్ (ఇన్ఫినిటీ కార్స్‌లో ఓ విభాగం)తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంపెనీ తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేశామని, త్వరలోనే రెండవ షోరూమ్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తామని కంపెనీ పేర్కొంది.

ఆస్టన్ మార్టిన్ కంపెనీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఏటా 8,000 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆస్టన్ మార్టిన్‌కు 42 దేశాల్లో 134 డీలర్లు ఉన్నారు. లియోనెల్ మార్టిన్ 1914లో మరియు రాబెర్ట్ బామ్‌ఫోర్డ్‌లు ఆస్టన్ మార్టిన్ స్థాపించారు. 1994 నుంచి 2007 వరకూ ఈ కంపెనీ అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌లో భాగంగా ఉండేది. 2007లో ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఫోర్డ్ నుండి విడిపోయింది.

More from DriveSpark

Article Published On: Saturday, April 16, 2011, 11:34 [IST]
English summary
The Gaydon, England-based luxury carmaker, Aston Martin entered into the domestic market with a bang, offering as many as 10 models from its luxury cars. Aston Martin will offer its whole range of cars except the Cygnet in the country - from the basic V8 Vantage to the ultra-exclusive One-77 Hyper car. Price range of Aston Martin cars starts from Rs 1.35 to Rs 20 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+