హైదరాబాద్ మార్కెట్లో ఏ7 స్పోర్ట్‌బ్యాక్ కారును విడుదల చేసిన ఆడి

ఇందులో ఏర్పాటు చేసిన శక్తివంతమైన ఇంజన్ 240 హార్స్ పవర్ సామర్ధ్యంతో గరిష్టంగా గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, 6 లీటర్ల ఇంధనంతో 100 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇంకా ఇందులో వేగాన్నిబట్టి ఆటోమేటిక్‌గా మారే ఏడు గేర్లు, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కంప్యూటర్‌లా పనిచేసే ఎంఎంఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కారు ఫీచర్లను మార్చుకోవచ్చు. డ్రైవ్ సెలెక్ట్ ఆప్షన్ ద్వారా వాహనాన్ని నడుపుతున్నప్పుడు మనకు నచ్చిన విధంగా సస్పెన్షన్, స్టీరింగ్, గేర్‌బాక్స్, ఇంజన్ తీరును మార్చవచ్చు.
అంతేకాకుండా.. రాడార్ ఆధారిత క్రూయిజ్ సిస్టమ్, 600 లీటర్ల బూట్ స్పేస్, వాయిస్ డైలాగ్ సిస్టమ్, నైట్ విజన్, 13 స్పీకర్లతో కూడిన 500 వాట్స్ మ్యూజిక్ సిస్టమ్ ఆడి ఏ7 సొంతం. 11 రంగుల్లో లభించే ఈ కారు ధర (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) రూ. 65,14,000.


Click it and Unblock the Notifications








