సెలబ్రిటీల ఎఫెక్ట్‌తో ఊపందుకున్న ఆడి విక్రయాలు

గడచిన అక్టోబర్ నెలలో ఆడి ఇండియా అమ్మకాలు 35.01 శాతం వృద్ధిని సాధించి 482 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయానికి కంపెనీ అమ్మకాలు 357 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈ సంవత్సరం జనవరి నుండి అక్టోబర్ మధ్య కాలం నాటికి మొత్తం అమ్మకాలు 85.09 శాతం వృద్ధిని సాధించి 4,692 యూనిట్లను విక్రయించింది.
గడచిన సంవత్సరం ఇదే సమయానికి ఇవి 2,535 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా తెలిపింది. 2011 సంవత్సరం ఆడి కార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ జరిగన అమ్మకాల పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు. ఆడి బ్రాండ్‌కు ఇంతటి ప్రజాదరణ లభించడానికి కారణం తమ ఉత్పత్తులలో నాణ్యతను అందించడంతో పాటుగా నెట్‌వర్క్‌ను పెంచుకోవడమేనని ఆయన చెప్పారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు గుల్ పనాగ్, జాన్ అబ్రహామ్ వంటి వారు కూడా ఆడి కార్లపై ఆసక్తి చూపుతుండటం పట్ల కంపెనీ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. 2011లో ఆడి మొత్తం ఆరు ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. భారత్‌లో మరింత మంది ప్రజలు చేరువయ్యేందుకు తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటామని కంపెనీ పేర్కొంది.
ఇందులో భాగంగానే మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాలపై కూడా దృష్టి సారిస్తామని, అమ్మకాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సంవత్సరం చివరి నాటికి 5,000 యూనిట్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని ప్రెష్కీ చెప్పారు. కాగా.. ఆడి ఇండియా అందిస్తున్న క్యూ5, క్యూ7 ఎస్‌యూవీలకు దేశీయ విపణిలో మంచి ఆదరణ లభిస్తుండటం కూడా ఆడి వృద్ధి కారణం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








