ఇంటర్నేషనల్ ఆటో ఎక్పో 2011ని బెంగుళూరులో జరపాలని ఆటోమొబైల్స్ దిగ్గజాలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆటో ఎక్పోలో ఎన్నోరకాల మోడల్స్ ని ప్రదర్శించడానికి ఆటో ఔత్సాహికులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 1930లో ఉన్నటువంటి డీ సోటో మోడల్స్ నుండి 1927లో ఫోర్డ్ తయారు చేసినటువంటి అన్ని రేంజ్ మోడళ్శులతోపాటు, ప్రస్తుతం ఉన్నటువంటి మరియు రాబోయే కాలంలో వస్తున్నటువంటి వాహానాలను కూడా ఈ ఇంటర్నేషనల్ ఆటో ఎక్పో లో ప్రదర్శించనున్నారు. ఇది మాత్రమే కాకుండా యాక్సిడెంట్స్ నికూడా పబ్లిక్ ఎలా వారిని కాపాడుకోవాలో, అసలు యాక్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆటో ఎక్పోలో ప్రదర్శించనున్నారు.
ఇంటర్నేషనల్ ఆటో ఎక్పోలో నానో నుండి జాగూర్ వరకు దాదాపు రూ 2లక్షలు నుండి రూ 140లక్షలు ఖరీదు చేసేటటువంటి వాహానాలను ప్రదర్శించనున్నారు ఈవిషయాన్ని కర్ణాటక రవాణా శాఖ మంత్రి స్వయంగా వివరించారు. ఈ ఇంటర్నేషనల్ ఆటో ఎక్పో ను బెంగుళూరులో మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. ఇలా నిర్వహించడానికి కారణం బెంగుళూరు యావత్ భారతదేశంలోనే ఆటో ఇండస్ట్రీకి ఓ పెద్ద హాబ్ కావడమేనని అన్నారు.