బిఎమ్‌డబ్ల్యూ నుంచి మరో సరికొత్త లగ్జరీ కారు విడుదల

కొత్త 2012 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కూపె పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 2012 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కూపె 650ఐ ప్రారంభ ధర రూ.74.99 లక్షలుగా ఉండగా, డీజిల్ వేరియంట్ 2012 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కూపె 640డి ప్రారంభ ధర రూ.84.99 లక్షలుగా ఉంది. అలాగే ఇందులో కన్వర్టబిల్ వెర్షన్ ధర రూ.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
కొత్త 2012 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కూపె విస్తృతస్థాయి కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది నాన్-మెటాలిక్ రంగులైన ఆల్పైన్ వైట్, ఇమోలా రెడ్ రంగుల్లోనూ మరియు టైటానియం సిల్వర్, బ్లాక్ సప్పైర్, హవన్నా, స్పేస్ గ్రే, డీప్ సీ బ్లూ, మినరల్ వైట్, వెర్మిలియన్ రెడ్, ఓరియన్ సిల్వర్ వంటి మెటాలిక్ రంగుల్లో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








