డీజిల్ బీట్ కారును విడుదల చేసిన జనరల్ మోటార్స్

"నేడు ఈ కారు (బీట్)ను దేశవ్యాప్తంగా విడుదల చేశాం. అయితే, ప్రస్తుతం మార్కెట్ కొంచెం నెమ్మదిగా సాగుతోంది, ప్రతి నెలా 5,000 డీజిల్ బీట్‌లను విక్రయించగలమని మేము భావిస్తున్నామ"ని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ తెలిపారు.
1-లీటర్ ఎక్స్ఎస్‌డిఈ స్మార్టెక్ డీజిల్ ఇంజన్‌తో లభించే బీట్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 4.29 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. దేశంలో అమ్ముడవుతున్న డీజిల్ కార్లలో కెల్లా బీట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్ కారే చవకైనదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం డీజిల్ ధరలు నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో డీజిల్ మోడళ్లకు దాదాపు 80 శాతం వరకూ గిరాకీ ఉంది.
కాగా.. డీజిల్ బీట్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో లభించే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త డీజిల్ బీట్ లీటరుకు 24 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డీజిల్ బీట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








