ఎఫ్ఎఫ్ స్పోర్ట్స్ కారును విడుదల చేసిన ఫెరారీ
ఫెరారీ ఎఫ్ఎఫ్ కారు ఢిల్లీలోని శ్రేయన్స్ గ్రూపు ద్వారా అందుబాటులో ఉండనుంది. ఇది 6-లీటర్ వీ12 ఇంజన్‌తో 660 బిహెచ్‌పిల శక్తిని, 683 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో ఫెరారీ ఎఫ్ఎఫ్ లభ్యమవుతుంది.
ఇది ఫెరారీ కంపెనీ నుండి వస్తున్న తొలి ఫోర్-వీల్ డ్రైవ్ కారు. ఫస్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ అనే సంకేతాన్ని ప్రతిబింభించేలా ఈ మోడల్‌కు ఫెరారీ ఎఫ్ఎఫ్ (ఫెరారీ ఫస్ట్ ఫోర్-వీల్) అనే పేరును కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది జనీవాలో జరిగిన 81 అంతర్జాతీయ మోటార్ షోలో తొలిసారిగా ఈ ఫెరారీ ఎఫ్ఎఫ్ కారును ప్రదర్శనకు ఉంచింది.
ఎఫ్ఎఫ్ కారు ముందువైపు డిజైన్ చూడటానికి దాదాపు ఫెరారీ 458 ఇటాలియాలా మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫెరారీ ఎఫ్ఎఫ్, ఇటాలియన్ కార్‌మేకర్ అందిస్తున్న తొలి ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ మాత్రమే కాకుండా.. ఫెరారీ నుంచి తొలి హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కూడా కావడం విశేషం. భారత మార్కెట్లో ఫెరారీ ఎఫ్ఎఫ్ కారు ప్రారంభ ధర రూ.3.42 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications









