అధికారికంగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫెరారీ

"నిన్నటి వరకూ ఫెరారీ 57 దేశాలకే పరిమితం, ఇప్పుడు మేము 58వ దేశంలోకి అడుగుపెట్టాం, అదే ఇండియా. ఇంతకు ముందు నుంచే మేము భారత్‌లో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రవేశించడం ఇదే ప్రప్రధమం, రానున్న 2-3 ఏళ్లలో ఇక్కడ 100కు పైగా కార్లను విక్రయించగలమని మేము అంచనావేస్తున్నాం" అని ఫెరారీ స్పా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమెడియో ఫెలీసా తెలిపారు. ఫెరారీ కార్లును భారత్‌కు దిగుమతి చేసుకునేందుకు శ్రేయన్స్ గ్రూపును కంపెనీ తమ అధికారిక దిగుమతిదారుగా నియనమించుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ఏర్పాటు చేసిన తమ తొలి డీలర్‌షిప్ కేంద్రంలో ఫెరారీ కార్ల బుకింగ్‌లను ఈ రోజు (గురువారం) నుంచే ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2011 సంవత్సరం ద్వితీయార్థంలో తమ రెండో షోరూమ్‌ను దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఏర్పాటు చేస్తామని కంపెని వివరించింది. భారత్‌లో ఫెరారీ కాలిఫోర్నియా ధర రూ. 2.2 కోట్లు, 458 ఇటాలియా ధర రూ. 2.56 కోట్లు, 599జిటిబి ఫియోరానో ధర రూ. 3.37 కోట్లు, అలాగే ఫెరారీ ఎఫ్ఎఫ్ ధరను రూ. 3.41 కోట్లు గానూ (అన్ని ధఱలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








