ఫోర్డ్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ హారికేన్ ఎండీవర్ ఎస్‌యూవీ

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ఫోర్డ్ ఎండీవర్ ధర కన్నా హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్ ధర రూ.40,000 అధికం. అయితే, ఇందులో కొన్ని ప్రత్యేక అధనపు ఫీచర్లు లభించనున్నాయి. కొత్త ఫోర్డ్ హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్ ఎస్‌యూవీ ఖచ్చితంగా ధరకు తగిన విలును ఇస్తుందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ చెప్పారు.
కొత్త హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో అదనంగా ఈ కింది ఫీచర్లు లభ్యం కానున్నాయి:
* కొత్త హెఫ్టీ ఫ్రంట్ నడ్జ్ బార్ (బంపర్)
* బాడీ డెకాల్స్ (హారికేన్ స్టిక్కర్‌తో బాడీ గ్రాఫిక్స్)
* ఐదవ (రియర్) డోర్‌పై అమర్చిన కన్వెక్స్ మిర్రర్
* సరికొత్త క్రోమ్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్)
ఇందులో డివిడి ప్లేయర్‌తో కూడిన టచ్-స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభించనుంది. స్పోర్టీ లుక్‌తో ఏడుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ జర్నీలకు కూడా చక్కగా సరిపోతుంది. ఇందులో ఉపయోగించిన 3-లీటర్ డ్యురాటెక్ టిడిసిఐ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








