కొత్త ఫియస్టా క్లాసిక్ ఎల్ఎక్స్ఐపై రూ.75,000 బంగారం ఉచితం

కొత్త ఫియస్టా క్లాసిక్ మూడు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ క్లాస్ లుక్, పర్‌ఫెక్ట్ హ్యాండ్లింగ్, విశాలమైన ఇంటీరియర్, మైలేజ్‌లో బెస్ట్ ఇన్ క్లాస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోర్డ్ గోల్డ్ రష్ ఆఫర్ కేవలం ఫియస్టా క్లాసిక్ టాప్-ఎండ్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) పెట్రోల్ వెర్షన్‌పై మాత్రమే లభిస్తుంది.
ఫియస్టా క్లాసిక్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర రూ.7,30,300 లుగా ఉంది. ఇదే కాకుండా.. ఫోర్డ్ అందిస్తున్న గ్లోబల్ ఫియస్టా పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపై రూ.50,000 విలువైన వివిధ ప్రోత్సాహకాలను (ఎక్సేంజ్ బోనస్, ఉచిత ఇన్సూరెన్స్ మరియు యాక్ససరీలు కలిపి) పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2011 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.
అలాగే, పండుగ సీజన్ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎస్‌యూవీ 'ఎండీవర్'కు కొన్న అదనపు ఫీచర్లను జోడించి ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఫోర్డ్ కొత్తగా విడుదల చేసిన 'హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్' రూ.20.13 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








