మహీంద్రా ఎక్స్‌యూవీ500 గెస్ ది ప్రైజ్ కాంటెస్ట్ విజేత!

ఇందులో భాగంగా కొత్త ఎక్స్‌యూవీ500 ధరను ఖచ్చితంగా అంచనా వేసిన వారికి ఓ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని బహుమతిగా ఇస్తామని ఎమ్ అండ్ ఎమ్ పేర్కొంది. కాగా.. ఈ కాంటెస్ట్‌లో కొల్హాపూర్‌కు చెందిన అమీత్ మేట్ అనే గ్రాండ్ ప్రైజ్‌గా ఓ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని సొంతం చేసుకున్నట్లు కంపెనీ తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లలో పేర్కొంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 140 బిహెచ్‌పిల శక్తిని, 33 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.


Click it and Unblock the Notifications








