కర్ణాటకలో హోండా మూడవ ద్విచక్ర వాహన ప్లాంట్

తమ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం హెచ్‌ఎస్‌ఎమ్‌ఐ కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకుంది. కర్ణాటకలోని కోలార్ మూడవ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హోండా పేర్కొంది. ఈ విషయంపై తుది సంప్రదింపుల కోసం హోండా మోటర్స్ అధికారులను కర్ణాటక రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశన్ నీరానీ ఆహ్వానించారు.
కొత్త ప్లాంటుకుఈ నెల 29న శంకుస్థాపన జరపనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం హోండాకు భారత్‌లోని హర్యానాలోని మానేసర్‌లోనూ, రాజస్థాన్‌లోని తపుకారాలోను రెండు ప్లాంట్లు ఉన్నాయి. ప్రారంభ దశలో భాగంగా కర్ణాటకలోని ప్లాంటును సాలీనా 12 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో, రూ.1,350 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది.


Click it and Unblock the Notifications