శాంటాఫేలో కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన హ్యుందాయ్

Hyundai Santa Fe
దేశపు రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట‌లో అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'శాంటా ఫే'లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో కూడిన సరికొత్త శాంటాఫే ఎస్‌యూవీను రూ.24,36,500 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో హ్యుందాయ్ విడుదల చేసింది.

గతేడాది మార్కెట్లోకి విడుదలైన శాంటాఫే ఎస్‌యూవీకు మార్కెట్లో అశేష ఆదరణ లభించిందని, కొత్తగా విడుదల చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో కూడిన ఎస్‌యూవీ ద్వారా ఈ ఆదరణ మరింత పెరగగలదని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ హెచ్.డబ్ల్యూ. పార్క్ తెలిపారు. కొత్త శాంటాఫే ఎస్‌యూవీ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది ట్రాఫిక్ రోడ్లపై కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీలో ఉండే ప్రధాన ఫీచర్లు:

* ఇది శక్తివంతమైన 2.2 లీటర్ సిఆర్డిఐ ఇ-విజిటి (CRDi e-VGT) ఇంజన్ (197 ps / 42.9 kgm)తో లభిస్తుంది.
* ఇందులో ఆరు ఎయిర్స్‌బ్యాగ్స్‌తో యాక్టివ్ హెడ్‌రెస్ట్ రోల్-ఓవర్ సెన్సార్స్ మరియు ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ (ఈఎస్‌పి)లు ఉండటం వల్ల సురక్షతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభుతిని పొందవచ్చు.
* మూడు వరుసలలో ఉండే సౌకర్యవంతమైన సీటింగ్.
* క్రూయిజ్ కంట్రోల్.
* పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు ముందువైపు ఉండే ప్యాసింజర్ సీట్.
* వినియోగదారుల డిమాండ్‌పై 4-వీల్ డ్రైవ్ ఆప్షన్.
* ఇది లీటరుకు 11.7 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2011, 11:01 [IST]
English summary
Country's second largest carmaker Hyundai Motor on Monday launched a new variant of its sports utility vehicle (SUV) Santa Fe with automatic transmission (AT) system, priced at Rs.24,36,500 (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+