'ఆల్టో' ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కారు

2010లో ఆల్టో 3,00,956 కార్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ 2,93,738 కార్లు, 2,51,078 ఫోక్స్‌వ్యాగన్ గోల్డ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ కార్‌గా నిలిచిన ఇండియా కంపెనీలలో మారుతి సుజుకినే మొట్టమొదటిది. సెప్టెంబర్ 2000లో ఆల్టో కారు విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే ఆల్టో భారీ విజయాలను నమోదు చేయడం ప్రారంభించింది.
ఇప్పటి వరకూ 16.68 లక్షల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. 2005-06 ఆర్థిక సంవత్సరం వరకూ ఆల్టో కారే భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా ఉండేది. ఎనిమిదేళ్లలోనే (నవంబర్ 2008లో) ఆల్టో 10 లక్షల విక్రయాల మార్కును అధిగమించి భారత్‌లోనే అత్యంత వేగంగా 10 లక్షల విక్రయాలను పూర్తి చేసుకున్న కారుగా నిలిచింది.
భారత్‌లో ఆల్టో కారు సాధించిన మరికొన్ని రికార్డులు:
* దేశీయ విక్రయాలలో 5 లక్షల మార్కును తాకిన తొలి కారు (ఆరేళ్లలో).
* మరో 5 లక్షల విక్రయాల మార్కును కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లో సాధించింది.
* ఫిబ్రవరి 2008లో 10 లక్షల కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది.
* ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెండు లక్షల దేశీయ విక్రయాలను సాధించిన తొలి కార్ బ్రాండ్, ఇలా రెండు సార్లు (2006-07, 2007-08లలో) జరిగింది.
* ఆర్థిక సంవత్సరం 2005-06 వరకూ భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారు.
* కేవలం 150 రోజుల్లో లక్ష కార్లు అమ్ముడైన కారు.
Awards & Accolades for Alto:
* 2000 : Winner of the “Overdrive most exciting new car of the year"
* 2001 : BS Motoring Car of the year 2001
* 2002 : Overdrive Car of the year 2002
* First Indian car to undergo a 24 hrs endurance test and set 13 national records
* Topper of the JD Power IQS in its segment for 2 years i.e 2004 and 2005
* 2006 : Winner of the EFFIE award for Boondein campaign
* 2007 : Winner of the EFFIE award for the 'fuel efficiency' campaign


Click it and Unblock the Notifications








