జెనీవా మోటార్ షోలో జాగ్వార్ లగ్జరీ కార్ ప్రదర్శన..!

మార్చి 1, 2011 నుంచి జెనీవాలో ఈ మోటార్ షో ప్రారంభం కానుంది. జగ్వార్ బ్రాండ్‌లో ఎక్స్‌కెఆర్-ఎస్ ఒక సరికొత్త ఎగ్జైటింగ్ మోడల్ అని, కొత్తగా జగ్వార్ డ్రైవ్ చేయాలనుకునే వారికి, లగ్జరీ కార్లలో ఇంకా సౌకర్యవంతమైన డ్రైవ్ కోరుకునే వారిని ఇది తప్పక ఆకట్టుకుంటుందని జాగ్వార్ గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అడ్రియన్ హాల్‌మార్క్ అన్నారు.
ఇలాంటి కార్లను ఒక్క జాగ్వార్ మాత్రమే అందించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కారు గంటకు 300 (గరిష్ట వేగం) కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ ప్రకటచింది. ఈ లగ్జరీ కారు కేవలం 8.6 ఆరు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని, అంతేకాకుండా ఈ కారు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. ఇది కిలోమీటరుకు 300 గ్రాముల కన్నా తక్కువగా కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








