పిక్-అప్ విభాగంలో 16 శాతం వృద్ధిని సాధిస్తాం: మహీంద్రా

గతేడాది (2010)లో పిక్-అప్ విభాగంలో కంపెనీ 5-7శాతం వృద్ధిని సాధించిందని, మరో రెండేళ్లలో ఈ విభాగంలో విక్రయాలు 3,50,000 యూనిట్ల నుంచి 4,00,000 యూనిట్లకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తుంది. చిన్నతరహా, మద్యతరహా వాణిజ్య సంస్థలు తమ రణావా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన "మహీంద్రా పిక్-అప్" చక్కగా ఉపయోగపడుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో దీని ధర రూ. 5.05 లక్షలుగా ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు జినియో (మిని ట్రక్) డిజైన్, తయారీ కోసం ఎమ్ అండ్ ఎమ్ రూ. 225 కోట్ల పెట్టుబడులను వెచ్చించింది.
అంతేకాకుండా.. జినియోను ఎగుమతి చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. దక్షిణాఫ్రికా, ఆఫ్రికా దేశాలలో మహీంద్రాకు పటిష్టమైన మార్కెట్ ఉంది. ఈ ప్రాంతాలలో మహీంద్రా వాహనాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. జినియోలో మరో వర్షన్ కూడా తుది మెరుగులు దిద్దుకోంటుంది. అయితే దీని విడుదలకు సంబంధించిన సమయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మహీంద్రా పిక్-అప్ సగటున నెలకు 6,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. జినియో కూడా సగటున నెలకు 2,000 విక్రయం కాగలవని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. జినియో డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తి ఉంటుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








