సెకండ్‌హ్యాండ్ కార్ల సూపర్‌స్టోర్‌ను ప్రారంభించిన మహీంద్రా

ఇక్కడ సెకండ్‌హ్యాండ్ వాహనాల క్రయ విక్రయాలు, కార్ ఫైనాన్స్, కార్ ఇన్సూరెన్స్, కారు ఉపకరణాల విక్రయం, మరమ్మత్తులు, డాక్యుమెంటేషన్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మొట్టమొదటి మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ సూపర్‌స్టోర్‌ను ఆగస్టు, 2007లో ముంబైలో ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహీంద్రాకు ఇలాంటివి ఎనిమిది సూపర్‌స్టోర్‌లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో మరికొన్ని సూపర్‌స్టోర్‌లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.
భారత్‌లో ప్రతి ఏటా 22 లక్షల సెకండ్‌హ్యాండ్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ సుమారు రూ. 25,000 కోట్ల వరకూ ఉండవచ్చు. సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ ప్రతి ఏటా దాదాపు 20 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది. మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ నుంచి సెకండ్‌హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కారు నాణ్యతకు సంబంధించిన హామీ, భద్రత, 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, వారంటీ వంటి ప్రయోజనాలను మహీంద్రా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








