జనవరిలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 బుకింగ్స్ రీఓపెన్

Mahindra Bookings Re-open
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తొలిసారిగా ప్రంపచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించి భారత మార్కెట్లోకి విడుదల చేసిన తొలి గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" అంటే ఇష్టపడేవారికి, ఈ మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగానే తీపివార్త. వచ్చే జనవరిలో ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ బుకింగ్‌లను పునఃప్రారంభిస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మోడల్‌కు లభిస్తున్న అపూర్వ స్పందనతో బుకింగ్‌లు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి వస్తుండటంతో గడచిన అక్టోబర్ నెలలో దీని బుకింగ్‌లను నిలిపివేసింది. అతి తక్కువ ధరలో ప్రపంచ స్థాయి ఫీచర్లతో భారతీయ కొనుగోలుదారులను ఆకట్టుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వీటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

అయితే, వచ్చే నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు ఇలానే ఉంటాయనే నమ్మకాలు కనిపించడం లేదు. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఇందన ధరలు, వడ్డీ రేట్లు మరియు ఉత్పాదక వ్యయాల కారణంగా ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని విడుదల చేసే సమయంలోనే, ఇవి కేవలం ప్రారంభ ధరలు మాత్రమేనని, మరో మూడు నెలల్లో వీటి ధరలు సవరించే అవకాశం ఉందని పేర్కొంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ విడుదలైన 10 రోజుల్లోనే 8,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. కంపెనీ ఇప్పటికే నాలుగు నెలల మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఉత్పత్తిని విక్రయించింది. వచ్చే జనవరి నాటికి మొత్తం బుకింగ్‌లను క్లియర్ చేయగలమని కంపెనీ అంచనా వేస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే.. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇందులో ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 3, 2011, 10:49 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. (M&M), a part of the US $14.4 billion Mahindra Group, today announced that it would re-open bookings of its XUV5OO in January 2012. The XUV5OO had received over 8000 bookings in just 10 days, making it one of the most overwhelming responses to a new car launch in recent times. Mahindra had sold out 4 months production of the XUV5OO and had hence temporarily deferred new bookings since October 11th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+