మహీంద్రా ఎక్స్‌యూవీ500: చిరుత పులి లాంటి పెర్ఫామెన్స్

ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ విడుదల సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. ఇది కేవలం కారు మాత్రమే కాదని, ఇదొక కల్ట్ వెహికల్ అని, చిరుత పులిలోని శక్తి ద్వారా స్ఫూర్తి పొంది ఈ వాహనాన్ని డిజైన్ చేశామని, పొదలమాటున దాక్కుని ఉన్న చిరుత తన లక్ష్యాన్ని అందుకోవడానికి ఎంతవేగంగా ఎగురుతుందో అలాగే, తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కూడా మంచి శక్తిని కలిగి ఉంటుందని అన్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 140 బిహెచ్‌పిల శక్తిని, 33 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.
ఎక్స్‌యూవీ500 గ్లోబల్ ఎస్‌యూవీకు సంబంధించిన సాంకేతిక వివరాలు, ధరల గురించి నేడు (గురువారం) కంపెనీ మరో ప్రకటనలో వెల్లడించనుంది. ఎక్స్‌యూవీ500కు సంబంధించిన మరింత సమాచారం కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








