ఒకేరోజులో 111 మంది కస్టమర్లకు కొత్త ఆల్టో 800 కార్లు డెలివరీ
మారుతి సుజుకి ఆల్టో 800 కారు మరో రికార్డు సృష్టించనుంది. గడచిన వారంలో కేరళలో ఒక్క రోజులో 200 మంది కస్టమర్లకు ఒకేసారి కొత్త ఆల్టో 800 కార్లను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కేరళలో మరో డెలివరీ రికార్డు నమోదు కానుంది. కేరళలోని మారుతి సుజుకి అధీకృత డీలర్‌షిప్ కెవిఆర్ కాసర్‌గాడ్ నేడు (నవంబర్ 1, 2012) ఒకేసారి 111 మంది కస్టమర్లకు ఆల్టో 800 కార్లను డెలివరీ చేయనున్నారు.

అక్టోబర్ 19, 2012వ తేదీన కూడా కేరళలోని కాలికట్‌కు సమీపంలో ఉన్న మల్లపురం జిల్లాలోని కొట్టక్కున్నులో 'మెగా డెలివరీ ఈవెంట్' అనే పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెండు వందల మంది కస్టమర్లకు ఒకే రోజులో కొత్త ఆల్టో కార్లను డెలివరీ చేయటం జరిగింది. ఇలా ఒక్క రోజులో ఒకేసారి 200 మంది కస్టమర్లకు కార్లను డెలివరీ చేయటం భారతదేశంలోనే ఇదే ప్రప్రథమం.
మారుతి సుజుకి ఆల్టో 800 కారుకు ఇప్పటికే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రాగా, అందులో సుమారు 13,000 యూనిట్లకు పైగా డెలివరీలను చేసినట్లు అంచనా. మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన రీడిజైన్డ్ ఎఫ్8డి 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్లో లభ్యమయ్యే మారుతి సుజుకి ఆల్టో 800 వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)
సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:
మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)


Click it and Unblock the Notifications








