లీజు పద్ధతిలో కార్లను అందించనున్న మెర్సిడెస్ బెంజ్

అసలు విషయం ఏంటంటే.. మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ అయిన డైమ్లర్ ఇటీవల భారత మార్కెట్లో ఆర్థిక సేవలు ప్రారంభించిన సంగతి తెలిందే. అయితే, మెర్సిడెస్ బెంజ్ స్వతహాగా ఈ ఆర్థిక సేవల విభాగాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంజ్ తమ కార్లు లీజు పద్దతి ప్రకారం, నిర్ణీత కాలం వరకూ వినియోగదారులకు అందించనుంది.
భారత్‌లో ఈ తరహా లీజు విధానం ఇదే మొట్టమొదటిదని, భారత్‌లో తమ ఆర్థిక సేవలు (మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ హోనెగ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై మార్కెట్ అధ్యయనం చేస్తున్నామని, మరికొద్ది వారాల్లోనే దీనిపై ఓ ప్రకటన వెల్లడిస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








