కార్ లీజింగ్ వ్యాపారాన్ని ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

ఈ కొత్త స్కీమ్ ప్రకారం, నెలవారీ అద్దె (మంత్లీ రెంటల్) ప్రాతిపధికన 12 నెలల నుండి 36 నెలల వరకూ లీజుకు తీసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత కస్టమర్లు కావాలనుకుంటే లీజుకు తీసుకున్న కారునే కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రారంభ పెట్టుబడి లేకుండా, తక్కువ అద్దెను చెల్లించి కస్టమర్లు మెర్సిడెస్ బెంజ్ కారును పొందవచ్చని, ఈ స్కీమ్ మూడేళ్లపాటు ఇన్సూరెన్స్, మెయింటినెన్స్ ఖర్చులను కవర్ చేస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) దెబాశిష్ మిత్రా తెలిపారు.
ఈ లీజును గడచిన సంవత్సరం జులై నెలలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించిన డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజి భారతీయ అనుబంధ సంస్థ అయిన డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ద్వారా మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ బ్రాండింగ్ కింద అందిస్తుంది. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగుళూరు మరియు చెన్నైలలోని డీలర్‌షిప్‌లలో స్టార్ లీజ్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








