విడుదలకు సిద్ధమైన రీనాల్ట్ చిన్న కారు: గ్రాండ్ ప్రిలో ఆవిష్కరణ

ప్రస్తుత సంవత్సరంలో ఆరంభంలో రీనాల్ట్ భారత్ మార్కెట్లో ఐదు ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రీనాల్ట్ ఇప్పటికే రెండు ఉత్పత్తులను (ఫ్లూయెన్స్ సెడాన్, కొలియోస్ ఎస్‌యూవీ) విడుదల చేసింది. మూడవ ఉత్పత్తిగా మాడ్యూస్ చిన్న కారును, నాల్గవ ఉత్పత్తిగా డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఉన్న రీనాల్ట్-నిస్సాన్ ఒరగడం ప్లాంటులో రీనాల్ట్ ఈ మాడ్యూస్ కారును ఉత్పత్తి చేయనుంది. రీనాల్ట్ ఇప్పటికే తమ చిన్న కారు మాడ్యూస్‌ను భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ప్రపంచ మార్కెట్లలో ఇది రెండు బాడీ టైప్‌లలో లభ్యం అవుతుంది. అవి.. మాడ్యూస్, గ్రాండ్ మాడ్యూస్. అయితే, గ్రాండ్ మాడ్యూస్ ఇప్పట్లో భారత్‌కు వచ్చే సూచనలు కనబడటం లేదు.
ఉమ్మడి ప్లాంటులో తయారవుతుండటం వలన రీనాల్ట్ మాడ్యూస్‌లో కూడా నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ మాడ్యూస్ 1.2 లీటర్ ఇంజన్‌ను, డీజిల్ వేరియంట్ మాడ్యూస్ 1.5 వీచప్ డిసిఐ ఇంజన్‌ను కలిగి ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








