సన్ని సెడాన్‌ను భారత్‌లో ఆవిష్కరించిన నిస్సాన్

నిస్సాన్ 1966లో మొదటిసారిగా సన్ని కారును విడుదల చేసింది. గడచిన 45 ఏళ్లుగా సన్ని పేరు నిస్సాన్ కంపెనీకు ఓ ఐకానిక్ నేమ్‌గా నిలిచిపోయింది. కాగా.. ప్రస్తుతం ఆవిష్కరించిన నిస్సాన్ సన్ని 10వ తరానికి (టెన్త్ జనరేషన్) చెందినది. నిస్సాన్ సన్ని సెడాన్‌ను వీ-(వెర్సిటైల్) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. నిస్సాన్ చిన్న కారు 'మైక్రా' తయారీలో కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు.
ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్ డిజైన్, సరికొత్త లుక్‌తో ఇది మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది. గతేడాది దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఇండియా విడుదల చేసిన చిన్న కారు మైక్రాకు దేశీయ మార్కెట్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా.. భారత్‌లో నిస్సాన్‌కు ఇది రెండవ కారు కావడం విశేషం. అయితే, నిస్సాన్ సన్ని సెడాన్ కారు ధర తదితర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








